Death Sentence: కుటుంబ సభ్యులను కాల్చి చంపిన జంటకు ఒకేసారి 4 మరణశిక్షలు.. కోర్టు సంచలన తీర్పు..

ప్రతీకాత్మక చిత్రం

Death Sentence: తమిళనాడుకు చెందిన గోవర్థన్​ అనే వ్యక్తికుటుంబ కలహాలతో తన తల్లిదండ్రులను, తమ్ముడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన భార్య సహకారం తీసుకున్నాడు.

  • Share this:
కుటుంబ సభ్యులను మంటల్లో కాల్చి చంపిన జంటకు ఏకంగా 4 మరణశిక్షలు విధిస్తూ తమిళనాడు (Tamil Nadu) పైనమల్లి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 4 మరణశిక్షలతో పాటు దోషులకు రెండు జీవిత ఖైదులు, రూ.6 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. గోవర్థన్​ అనే వ్యక్తి నిద్రిస్తున్న తన తల్లిదండ్రులు, తమ్ముడిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన 2019 మేలో సంచలనం స‌ృష్టించింది. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అయినా పోలీసు అధికారులు ప్రత్యేక దర్యాప్తుతో అసలు దోషులకు కఠిన శిక్షలు పడేలా చేశారు.అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసు వివరాలు చూద్దాం. తమిళనాడుకు చెందిన గోవర్థన్​ అనే వ్యక్తికుటుంబ కలహాలతో తన తల్లిదండ్రులను, తమ్ముడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన భార్య సహకారం తీసుకున్నాడు.

వారిద్దరూ కలిసి పక్కాగా ప్లాన్​ అమలు చేశారు. నిద్రిస్తున తల్లిదండ్రులు, సోదరుడిపై పెట్రోల్ పోసి కాల్చి చంపారు. అయితే,ఏసీ పేలుడు కారణంగా తన కుటుంబ సభ్యులు చనిపోయారంటూ ఘటన తరువాత పోలీసులకు తెలిపాడు. అయితే,మెడికల్ రిపోర్టు, కెమికల్ అనాలసిస్ రిపోర్టు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో తయారైన రిపోర్టు ఆధారంగా గోవర్థన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిరూపితమైందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్. విజయరాజ్ తెలిపారు. ఇప్పటికే గోవర్థన్ కు మూడు కింది కోర్టులు కూడా మరణశిక్ష విధించాయని ఆయన గుర్తు చేశారు. పూనమల్లిలోని బాంబు పేలుళ్ల ప్రత్యేక కోర్టుకు చెందిన జిల్లా జడ్జి పి.వేలుమురుగన్ ఈ తీర్పు వెలువరించారు.

పథకం ప్రకారమే హత్య..
కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు డబ్బు ఇవ్వాలంటూ గోవర్థన్ చాలా కాలంగా తల్లిదండ్రులను వేధిస్తున్నాడని, వారు పట్టించుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. 2019 మే నెలలో తాళం వేసిన ఓ ఇంటిలో బాధితులను గుర్తించారు. అయితే గోవర్థన్ మాత్రం ఏసీ పేలుడు వల్లే వారు చనిపోయారని చెప్పాడు. పోలీసులు కూడా తొలుత అలాగే కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు విచారణకు ఉన్నతాధికారులు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. చనిపోయిన వారిలో ఒకరి శరీరంపై గాయాలు కూడా ఉండటంతో పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. తల్లిదండ్రులు, తమ్ముడిపై గోవర్థన్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఏసీ పేలలేదని కేవలం మంటల్లో కాలిందని పోలీసులు నిర్థారించారు.

ఇది కూడా చదవండి : ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారితో ఆ మహిళల శృంగారం.. ఎలా బయటపడిందంటే..

నిందితులు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఫోరెన్సిక్ నివేదిక కూడా నిందితులను పట్టించింది. రిపోర్టులన్నీ పరిశీలించిన కోర్టునిందితులైన భార్యాభర్తలిద్దరికీమరణశిక్ష విధిస్తూతీర్పు వెలువరించింది. మరణశిక్ష తీర్పు వెలువడగానే దోషులు ఒక్కసారిగా కోర్టు ఆవరణలోరోధించారు. కోర్టు విధించిన జీవిత ఖైదులను ఒకేసారి అమలు చేయాలని, ఒకవేళ ఇప్పటికే వారు శిక్షను అనుభవిస్తూ ఉంటే దాన్ని అక్కడితో ఆపాలని కోర్టు ఆదేశించింది.
Published by:Sridhar Reddy
First published: