Home /News /crime /

TAMIL NADU SI MARGARET TERESA BRUTALLY ATTACKED CHIEF MINISTER MK STALIN RELIEF FOR WOMAN SI WHO WAS STABBED IN NELLAI PAH

Shocking: నా పైనే కేసు పెడతావా.. మహిళా ఎస్‌ఐపై కత్తితో దాడి.. సీఎం సీరియస్.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికుల నిరసనలు..

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఎస్సై

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఎస్సై

Tamil nadu crime news: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మహిళా పోలీసుపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాట తీవ్ర దుమారంగా మారింది.

Tamil nadu Woman Si Margaret Teresa brutally attacked: కొంత మంది ఆగంతకులు రెచ్చిపోతున్నారు. నేరాలకు పాల్పడేవారిని శిక్షించే పోలీసులపైనే దాడికి తెగబడతారు. ఇప్పటికే పలు చోట్ల పోలీసులపైన దాడికి సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజగా, ఈ కోవకు చెందిన ఘటన మరోసారి వార్తలలో నిలిచింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఒక ఆగంతకుడు వ్యక్తి మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. తిరునెల్వేలి జిల్లలోని సుత్తమల్లి పోలీస్ స్టేషన్‌లో మార్గరెట్ థెరిసా అనే యువ పోలీసు అధికారి విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో.. తిరునెల్వేలి జిల్లాలోని పళవూర్​ గ్రామంలోని ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. కాగా, మార్గరెట్ థెరిసా అక్కడ.. ఆలయ ఉత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వరిస్తున్నారు. ఈ క్రమంలో.. స్థానికంగా ఉండే 40 ఏళ్ల అరుముగమ్ అక్కడ పలువురితో అసభ్యంగా మాట్లాడుతూ.. గొడవ సృష్టించాడు. దీంతో థెరిసా.. రోడ్డుపై న్యూసెన్స్ ఆపాలని అతడిని హెచ్చరించింది. దీంతో అతను మరింత రెచ్చిపోయాడు.

అయితే గతంలో...మార్గరెట్ థెరిసా డ్రంకన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అప్పుడు అరుముగమ్ మోతాదుకు మించి మద్యంతాగి పోలీసులకు చిక్కాడు. దీంతో మార్గరెట్ థెరిసా ఇతనిపై కేసు నమోదు చేశారు. అప్పటి కోపాన్ని మనసులో పెట్టుకున్నాడు. ఎలాగైన ఆమెపై పగతీర్చుకొవాలను కున్నాడు.ఇదే అదనుగా భావించిన అరుముగమ్.. థెరిసాపై కత్తితో దాడి చేశాడు. దీంతో థెరిసాతో విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అరుముగమ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన థెరిసాను తిరునల్వేలి మెడికల్ కాలేజ్‌కు తరలించారు.

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ పి శరవణన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే తిరునల్వేలి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న థెరిసాను పరామర్శించారు. మరోవైపు తనను డ్రంక్​​ అండ్​ డ్రైవ్​ కేసులో అరెస్ట్​ చేసి ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారనే కోపంతోనే మార్గరెట్​ థెరిసాపై కత్తితో దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఇక, ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్ గా స్పందించారు. గాయపడిన థెరిసాను ఫోన్‌లో స్టాలిన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్  తక్షణ సహాయం కింద ఐదు లక్షలు విడుదల చేశారు. అదే విధంగా ఎస్సై తొందరగా కొలుకోవాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. థెరిసాకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్టుగా పేర్కొన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Attack with knifes, Crime news, Tamil nadu, WOMAN

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు