Home /News /crime /

TAMIL NADU ROAD ACCIDENT TRACTOR OVERTURNED IN KRISHNAGIRI DISTRICT FIVE KILLED SU

Road accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 5 గురు మృతి, 10 మందికి గాయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Krishnagiri Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు.

    దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చెట్టును ఢీ కొట్టి బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తమిళనాడులోకి కృష్ణగిరి జిల్లా మంజుకొండపల్లి సమీపంలో చోటుచేసుంది. దాదాపు 20 మంది ట్రాక్టర్‌లో దబ్బకులిలోని బసవేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను కర్ణాటకలోని రామనగర జిల్లా కనకపుర తాలుకాలోని కేరళలుచంద్ర గ్రామానికి చెందిన జి గౌరమ్మ(60), ఎం మంగళ(23), డీ కెంపమ్మ(70), వి పుట్టలింగమ్మ(65), ఎర్రమ్మ(65)గా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడినవారిని సమీపంలో ఆస్పత్రులకు తరలించారు. ఇక, దెంకానికొట్టై డీఎస్పీ సంగీత, అంచెట్టి పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను సోమవారం రాత్రి కనకపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అంచెట్టి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కేరళాల సంద్రకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ". మేము ప్రతి ఏడాది ట్రాక్టర్‌లో దబ్బకులి ఆలయ దర్శనానికి వస్తుంటాం. ఈ ఏడాది కూడా మా గ్రామం, మా సమీప గ్రామానికి చెందిన దాదాపు 20 మంది ట్రాక్టర్‌లో బయలుదేరాం. అయితే మరికాసేపట్లో ఆలయానికి చేరుకుంటామనగా ట్రాక్టర్ చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది" అని తెలిపాడు.

    ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా డీఎస్పీ సంగీత తెలిపారు. ఇక, గాయపడిన 10 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య అధికారులు తెలిపారు. మరో ఆరుగురి చేతులు, కాళ్లు ప్రాక్చర్ అయ్యాయని, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Karnataka, Road Accident, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు