ఓ గర్భిణి మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. గర్భిణీగా ఉన్న తనను సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా భర్త బలవంతం చేయడంతో ఆమె దారుణానికి ఒడిగట్టింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని పెరియమోలపాలయంకు చెందిన మైథిలికి అందియూర్ సమీపంలోని కాలియన్నన్ తొట్టంకు చెందిన నందకుమార్ అనే వ్యక్తితో 8 నెలల కిందట వివాహం జరిగింది. కుమార్ రైతుగా జీవనం సాగిస్తున్నాడు. అయితే కుమార్‌కు ఇది రెండో పెళ్లి. ఇక, మైథిలి 5 నెలల క్రితం గర్భం దాల్చింది. అయితే గర్భవతిగా ఉన్న మైథిలిని తనతో సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా కుమార్ బలవంతం చేసేవాడు. అయితే అందుకు మైథిలి నిరాకరించింది. దీంతో కుమార్.. ఆమెను హింసించేవాడు. ఈ క్రమంలోనే మైథిలి కుమార్ వేధింపులు భరించలేపోయింది. తన భర్తను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుంది. జనవరి 28న తన భర్త తింటున్న ఆహారంలో పురుగుల మందు కలిపింది.
దీంతో కుమార్ అనారోగ్యానికి గురయ్యాడు. జనవరి 31న అందియూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఫిబ్రవరి 15 కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఈ ఘటనపై అప్రమత్తమైన ఆస్పత్రి యజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు కుమార్ మృతికి సంబంధించి కేసు నమోదు చేశారు.
అయితే ఆలోపే మైథిలి తన నేరాన్ని అంగీకరించి పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. దీంతో మైథిలిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం ఆమెను 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.