Home /News /crime /

TAMIL NADU POLICE NAB WOMAN TEEN DAUGHTER FOR ABDUCTING INFANT BABY FROM GOVT HOSPITAL IN COIMBATORE PAH

ఎందుకమ్మా ఈ పని చేశావ్... మరోక తల్లి శిశువును ఇలా చేయడానికి మనసేలా వచ్చింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tamil nadu: మహిళ గవర్నమెంట్ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. తన బిడ్డతో కలిసి జనరల్ వార్డెన్ లో ఉంది. అయితే, అర్దరాత్రి ఒక మహిళ ఆస్పత్రిలో వీరి వార్డు దగ్గరకు వచ్చింది.

కొంత మంది మహిళలు తల్లుల నుంచి పిల్లలను వేరుచేస్తున్నారు. శిశువులను దొంగిలించి వారిని...పిల్లలు కావాలని అనే వారికి విక్రయిస్తున్నారు. మరికొందరు పిల్లలను దొంగిలించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడి రోడ్డు మీద వచ్చి పోయే వారిని యాచిస్తున్నారు. కొంత మంది.. మరీ దారుణంగా ఆస్పత్రులలో జోరబడి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం తరచుగా వార్తలలో చూస్తునే ఉంటాం. ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులోని దారుణ ఘటన జరిగింది. కోయంబత్తూరులోని గవర్నమెంట్ ఆస్పత్రిలో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. దివ్యభారతి అనే మహిళ, ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. శిశువు ఐదురోజుల కిందటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చింది. ఆదివారం జనరల్ వార్డెన్ లో ఉండగా.. ఒక మహిళ, తన టీనేజ్ కూతురుతో కలిసి ప్రవేశించింది. ఆ తర్వాత.. మెల్లగా పసికందును దొంగిలించింది. కాసేపటికి లేచి చూసిన తల్లి తన బిడ్డ లేకపోవడంతో షాక్ కు గురైంది.



వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక మహిళ పసికందును తీసుకెళ్తున్నట్లు గమనించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా అంతటా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు కేరళలోని పాలక్కాడ్ లో మహిళను పట్టుకున్నారు. ఆ తర్వాత.. సోమవారం తల్లి దివ్యభారతికి అప్పగించారు. మహిళలను, ఆమెను కూతురిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితురాలిని 34 ఏళ్లషమీనా గా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా  బీహర్ లో దారుణ ఘటన జరిగింది.

కొంత మంది ఉపాధ్యాయులు, తమ ఉద్యోగానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తారు. కొందరు విద్యార్థుల పట్ల అత్యంత దారుణాలకు పాల్పడుతుంటారు. విద్యా, బుద్ధులు నేర్పించాల్సిన వారే.. పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. కీచకులుగా మారి.. విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొందరు కంట్రోల్ తప్పి, విద్యార్థులపై దాడులు చేస్తుంటారు. స్టూడెంట్స్ ను ఇష్టమోచ్చినట్లు కొడుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

బీహర్ లో (Bihar) దారుణ ఘటన జరిగింది. పాట్నాలోని ధనరువా బ్లాక్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా జయ అనే కోచింగ్ సెంటర్ ఉంది. దానిలో చిన్న పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో.. ఐదేండ్ల చిన్నారిని ఛోటు అనే ఉపాధ్యాయుడు ఇష్టమోచ్చినట్లు కొట్టాడు. జుట్టుపట్టుకుని గొడ్డును బాదినట్లు బాదాడు. అతను బాధతో విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయాడు. దీంతో సిబ్బంది చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

చిన్నారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, దీనిపై కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అమర్ కాంత్ స్పందించారు. ఛోటు అనే ఉపాధ్యాయుడి చిన్నారిపై దాడిచేశాడని (Teacher thrashes boy)  తెలిపాడు. అతనికి అధిక రక్తపోటు ఉందని అందుకే ఇలా చేశాడని అన్నారు. స్థానికులు ఈ ఘటనను రికార్డు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Tamilnadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు