Home /News /crime /

TAMIL NADU POLICE FINALLY CAUGHT A MURDERER AFTER 23 YEAR OLD SEARCHING WITH A PHONE CALL HERE IS THRILLING STORY NK

దమ్ముంటే పట్టుకోండి. పోలీసులకు సవాల్. 23 ఏళ్లకు దొరికిన హంతకుడు. ఎలా?

ప్రతీకాత్మక చిత్రం (image credit - ANI)

ప్రతీకాత్మక చిత్రం (image credit - ANI)

పోలీసులకు వంద కేసులుంటాయి. ఒకే కేసుపై పూర్తిగా ఫోకస్ పెట్టలేరు. అదే ఆ హంతకుడికి వరమైంది. హత్య కేసులో ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు ఎలా దొరికాడు?

    ఎప్పుడో 1992లో కిందట తమిళనాడులో జరిగిన హత్య. అంటే 1998లో పారిపోయిన హంతకుడు... 23 ఏళ్ల తర్వాత ఆదివారం... కేరళలో అంబాసముద్రం పోలీసులకు దొరికాడు. ఇప్పుడు అతని వయసు 72 ఏళ్లు. ఈ కేసులో అతనికి తిరునల్వేలి జిల్లా సెషన్స్ కోర్టు... 1995లో జీవిత ఖైదు విధించింది. అతని పేరు పచాతు (Pachathu).

    హంతకుణ్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన అంబాసముద్రం డీఎస్పీ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు. "పచాతు... గౌతమపురి అనే గ్రామంలో ఉండేవాడు. అతను 1992లో పత్తముత్తు (Pattamuthu)ను చంపడంతో అరెస్ట్ అయ్యాడు. అతనికి తిరునల్వేలి జిల్లా సెషన్స్ కోర్టు 1995లో జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. కానీ మద్రాస్ హైకోర్టు... కింది కోర్టు తీర్పును సమర్థించింది. పచాతు పిటిషన్‌ను కొట్టిపారేసింది. మద్రాస్ హైకోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో... బెయిల్‌పై బయట ఉన్న పచాతు... కనిపించకుండా పోయాడు. 1998లో అతన్ని అరెస్టు చెయ్యమని కోర్టు ఆదేశించింది" అని ఫ్రాన్సిస్ చెప్పారు.

    1998లో మన్నివన్నన్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్... డీఎస్పీ ఫ్రాన్సిస్‌కి ఆదేశమిచ్చారు. అతన్ని పట్టుకోమన్నారు. డీఎస్పీ... అంబాసముద్రం పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్‌తో ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. హంతకుణ్ని కనిపెట్టమన్నారు. కానీ పోలీసులు ఎంత వెతికినా పచాతు దొరకలేదు. అయినప్పటికీ పోలీసులు ఇతర కేసులు చూసుకుంటూనే అప్పుడప్పుడూ పచాతు కేసును కూడా పరిశీలిస్తూనే ఉన్నారు. తాజాగా... పచాతు తన భార్యకు కాల్ చేశాడు. అప్పటివరకూ అతన్ని కనిపెట్టలేకపోయిన పోలీసులకు ఆ కాల్ ద్వారా ట్రేస్ చెయ్యడానికి వీలైంది.

    అప్పుడు తెలిసింది అతను తమిళనాడులో లేడనీ... కేరళలో ఉన్నాడని. కేరళలోని తడప్పుళాలో... కోవిడ్ కేర్ సెంటర్ ఉంది. అక్కడి ఓ లాడ్జిలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు పచాతు. తన పేరును మార్చుకొని నకిలీ పేరుతో బతికేస్తున్నాడు.

    పోలీసులు... పక్కా సమాచారంతో తడప్పుళాకి వెళ్లారు. పచాతు పారిపోకుండా అన్ని వైపులా సెక్యూరిటీని పెట్టుకున్నారు. కానీ చిత్రంగా పచాతు పోలీసులకు ఈజీగానే లొంగిపోయాడు. పారిపోకుండా, ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా దొరికాడు. చిత్రమేంటంటే... ఎప్పుడో 1992 నాటి ఫొటో మాత్రమే పోలీసుల దగ్గర ఉంది. అప్పటికీ ఇప్పటికీ పచాతు ఫేస్ చాలా మారింది. అయినా పోలీసులు కనిపెట్టేశారు.

    ఇది కూడా చదవండి: జాబ్ వదిలేసి.. చెత్త ఏరుతూ.. నెలకు 3 లక్షల సంపాదన!

    పచాతు గనక తన భార్యకు కాల్ చెయ్యకుండా ఉండి ఉంటే... అతను దొరికేవాడు కాదేమో. ఏదేమైనా పోలీసుల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అందులోనూ ఈ డిజిటల్ యుగంలో తప్పించుకోవడం చాలా కష్టం. సీసీటీవీలు, ఫోన్లు, వాట్సాప్, ఫేస్ బుక్ ఇలా ఏవో ఒకటి దొంగల్ని పట్టించగలవు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Crime news, Crime story, Kerala, Murder, Tamil nadu

    తదుపరి వార్తలు