• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TAMIL NADU POLICE ARRESTED PT MASTER BY KIDNAPPING STUDENT AND MARRY HER SRD

విద్యార్థినిని కిడ్నాప్ చేసిన పీటీ సార్..పెళ్లి చేసుకోవడానికి మాస్టర్ స్కెచ్..చివరికి ట్విస్ట్ ఏంటంటే..

విద్యార్థినిని కిడ్నాప్ చేసిన పీటీ సార్..పెళ్లి చేసుకోవడానికి మాస్టర్ స్కెచ్..చివరికి ట్విస్ట్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు ఆ కీచక ఉపాధ్యాయుడు. కిడ్నాప్ చేసిన తర్వాత ఏకంగా వివాహం చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు.

  • Share this:
    విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ పీటీ మాస్టర్ వక్రమార్గం పట్టాడు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి తన బుద్దిహీనతను బయటపెట్టుకున్నాడు. చివరకు తన హోదాను మరిచి కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు ఆ కీచక ఉపాధ్యాయుడు. కిడ్నాప్ చేసిన తర్వాత ఏకంగా వివాహం చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని మత్తూరు సమీపంలో జరిగింది. చివరికి పీటీ మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. విద్యార్ధినిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకెళితే.. కృష్ణగిరి జిల్లా మత్తూర్‌ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (16) ప్లస్‌ వన్‌ చదువుతోంది. ఈ మేరకు ఆమె తిరువణ్ణామలై జిల్లా మేల్‌ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్‌ మిషన్‌ మెట్రిక్యూలేషన్‌ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు కావ్య,మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    ఈ క్రమంలో తిరువన్నామలై నాగనూర్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్‌ రాజ్‌ గురించి పోలీసులకు తెలిసింది. ఆ బాలికపై పీటీ మాస్టర్ కన్నేసినట్లు తెలుసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. చివరికి, వివాహం చేసుకోడానికే ఆ విద్యార్థినిని చరణ్ రాజ్ కిడ్నాప్‌ చేసినట్లు వెల్లడైంది. దీంతో మత్తూరు పోలీసులు ఆదివారం చరణ్‌ రాజ్‌ను అరెస్టు చేశారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

    అయితే, పోలీసులు విచారణలో చరణ్ రాజ్ ఆసక్తి కర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వయస్సు పై బడుతున్నా తనకి ఇంతవరకు వివాహం జరగలేదని.. అందుకే బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నానని పోలీసులకు తెలిపాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఇంకా ఎవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
    Published by:Sridhar Reddy
    First published: