Home /News /crime /

TAMIL NADU POLICE ARRESTED 4 PERSONS INCLUDING 2 WOMEN IN BROTHEL CASE NK

Sex Racket: నలుగురు అరెస్టు... వారిలో ఇద్దరు మహిళలు

కాస్మోపాలిటన్ సిటి పేర నగరంలో వ్యభిచార దందాలు మసాజ్ సెంటర్ల ముసుగులో కొనసాగుతున్నాయి..నగర నడిబొడ్డున ఆ వ్యభిచార ముఠాలు ఈ మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు..
(సెక్స్ వర్కర్లు (File Image)

కాస్మోపాలిటన్ సిటి పేర నగరంలో వ్యభిచార దందాలు మసాజ్ సెంటర్ల ముసుగులో కొనసాగుతున్నాయి..నగర నడిబొడ్డున ఆ వ్యభిచార ముఠాలు ఈ మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.. (సెక్స్ వర్కర్లు (File Image)

Sex Racket: అదేమీ హైటెక్ సెక్స్ రాకెట్ కాదు. ఆ మహిళలు ఇష్టపడి అందులో చేరిందీ లేదు. అసలు ఇదంతా ఎలా జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో పోలీసులు క్లారిటీగా చెప్పారు.

    Sex Racket: తమిళనాడులో ఓ సెక్స్ రాకెట్... పోలీసులను ఆలోచనలో పడేసింది. ఎందుకంటే... ఇష్టపడి సెక్స్ రాకెట్‌లోకి వెళ్లేవారు చాలా మంది ఉంటారు. కానీ... ఆ మహిళలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా వెళ్లారని తెలుసుకున్నారు. అసలేం జరిగిందంటే... మధురైలో ఓ ఫ్యామిలీని కరోనా కాటేసింది. కష్టాలు క్యూ కట్టాయి. చేతిలో డబ్బులేదు. అప్పుల బాధలు. ప్రతి రోజూ నరకమే. ఏం చెయ్యాలో తెలియదు. చేద్దామంటే పనులు లేవు. ఆ విపత్కర పరిస్థితుల్లో ఉండగా... ఇద్దరు వ్యక్తులు అప్పుల వారి ద్వారా అడ్రెస్ తెలుసుకొని ఆ ఇంటికి వచ్చారు. నెలకు రూ.లక్ష దాకా డబ్బు వచ్చేలా చేస్తామన్నారు. తాము చెప్పినట్లు చెయ్యాలన్నారు. పనేంటని అడిగితే సెక్స్ వర్కర్స్‌గా చెయ్యాలి అన్నారు.

    ఆ ఫ్యామిలీ షాకైంది. తాము అలాంటి వాళ్లం కాదని చెప్పింది. చావనైనా చస్తాం గానీ... ఇలాంటివి చేసేది లేదని చెప్పింది. కానీ ఆ వచ్చిన ఇద్దరూ చాలా తెలివైన వాళ్లు. ఆ ఫ్యామిలీ సభ్యులకు లేనిపోని మాటలు చెప్పి... డబ్బు ఆశ చూపి... మెల్లగా వారిని తమవైపు తిప్పుకున్నారు. చివరకు వారిని ఒప్పించారు. బిజినెస్ మొదలైంది. తరచూ ఇద్దరు మహిళల్ని వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్తూ... వారితో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. ఇలా ఒకసారి ఓ మహిళ వచ్చినందుకు ఆమెకు రూ.5వేలు ఇస్తున్నారు. అలా నెలకు రూ.లక్ష వచ్చేలా ప్లాన్స్ అమలు చేస్తున్నారు.

    ఎవరో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. మధురైలోని తెప్పకులం ఇన్‌స్పెక్టర్ హేమలత సారధ్యంలో యాంటీ ట్రాఫికింగ్ యూనిట్... దాడులు చేసింది. ఆ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలూ దొరికారు. వాళ్లను ఇంటరాగేట్ చేసినప్పుడు పైన చెప్పిన మ్యాటర్ పోలీసులకు చెప్పారు. అరెస్టైన ఇద్దరు పురుషుల్లో నార్త్ కుమాసీ వీధికి చెందిన పాండియరాజా అనే వ్యక్తి ఈ సెక్స్ రాకెట్ మొత్తం నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. మరో వ్యక్తి గుణశేఖర్ అని చెప్పారు.

    ఇది కూడా చదవండి: జోరుగా పెళ్లి... అంతలో వధువుకు వరుడి ముద్దు.. వీడియో వైరల్

    ఇక్కడే కాదు తమిళనాడులోని సెల్లూర్, తపల్తాంటి నగర్, అవనియపురం, విల్లపురంలో ఇలాగే ఫ్యామిలీ మహిళలు వ్యభిచార వృత్తిలోకి దిగిపోతున్నారు. దీని వెనక పాండియరాజా మాత్రమే కాదనీ... ఇంకా కొంత మంది ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచాలని కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Sex Racket, Tamil nadu, Viral, VIRAL NEWS

    తదుపరి వార్తలు