కూతురిని ప్రేమించిన యువకుడు.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు.. కట్ చేస్తే..

విజయ్‌కుమార్, దీప

కూతురు ప్రేమ వ్యవహారంపై విజయ్‌కుమార్, దీప దంపతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మహ్మద్ ఫెమినాస్‌కు తమ కూతురిని ప్రేమించవద్దంటూ పలుమార్లు చెప్పారు.

  • Share this:
    కూతురు ప్రేమ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆవేశంతో రగిలిపోయారు. తమ కూతురికి దూరంగా ఉండాలంటూ ఆమె ప్రియుడికి కోరారు. అయిన వారిద్దరు ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆవేశానికి లోనైన యువతి తల్లిదండ్రులు.. ఆమె ప్రియుడిని నరికి చంపేందుకు యత్నించాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తిరువరూర్‌ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. తిరువరూర్ సమీపంలోని ఆదియక్కమంగళం మసీదు వీధి ప్రాంతానికి చెందిన బక్రుద్దీన్ అలీ అహ్మద్ కొడుకు మహ్మద్ ఫెమినాస్.. అదే ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్, దీపల కుమార్తెను ప్రేమించాడు. అయితే కూతురు ప్రేమ వ్యవహారంపై విజయ్‌కుమార్, దీప దంపతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మహ్మద్ ఫెమినాస్‌కు తమ కూతురిని ప్రేమించవద్దంటూ పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ అతడు పద్దతి మార్చుకోలేదు.

    ఈ క్రమంలోనే విజయ్‌కుమార్, దీప దంపతులు బైక్‌పై నేరుగా మహ్మద్ ఫెమినాస్ ఇంటికి వెళ్లారు. ఫెమినాస్‌ను తమ కూతురి దూరంగా ఉండేలా చూడాలని అతని తల్లిదండ్రులకు చెప్పారు. తమ కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి చేయబోతున్నట్టు తెలిపారు. అయితే ఫెమినాస్ మాత్రం.. తాను ప్రేమించిన అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో విజయ్‌కుమార్, దీప దంపతులు ఆవేశానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తమతో తెచ్చకున్న కొడవలిని తీసి.. మహ్మద్ ఫెమినాస్‌పై దాడి చేశాడు. అతని తలపై, చేతిపై నరికి అక్కడి నుంచి పారిపోయారు.

    రక్తపు మడుగులో పడిపోయిన ఫెమినాస్‌ను అతని బంధువులు వెంటనే తిరువరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆవేశానికి లోనైన ఫెమినాస్ బంధువులు ఆదియక్క మంగళంలోని విజయ్‌కుమార్‌కు చెందిన షాప్‌పై దాడి చేశారు. మరోవైపు మైలాడుతురై జిల్లాలో తలదాచుకున్న విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని భార్య దీపను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. విజయ్‌కుమార్, అతని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫెమినాస్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు నమోదు చేశారు.

    ఈ క్రమంలోనే ప్రస్తుతం తిరువరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫెమినాస్ త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక, విజయ్‌కుమార్, దీపలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూతురిని ప్రేమించిన వ్యక్తిపై తల్లిదండ్రలు ఈ రకమైన దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
    Published by:Sumanth Kanukula
    First published: