Home /News /crime /

TAMIL NADU NEIGHBOUR INSTALL WEB CAMERA TO SAW A WOMAN TAKING A BATH IN NEARBY HOUSE IN THANJAVUR SU

తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి.. భార్య సివిల్ సర్వెంట్.. కానీ అతడి బుద్ది మాత్రం..

నాసిర్ అహ్మద్

నాసిర్ అహ్మద్

అతనికి పెళ్లైంది.. ఆరేళ్ల కూతురు కూడా ఉంది. అతని తండ్రి రిటైర్డ్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్.. భార్య సివిల్ సర్వేంట్. అంతా బాగానే ఉన్నప్పటికీ అతడు మాత్రం నీచమైన చర్యకు పాల్పడ్డాడు.

    అతనికి పెళ్లైంది.. ఆరేళ్ల కూతురు కూడా ఉంది. అతని తండ్రి రిటైర్డ్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్.. భార్య సివిల్ సర్వేంట్. అంతా బాగానే ఉన్నప్పటికీ అతడు మాత్రం నీచమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న కుటుంబంలోని ఆడవాళ్లు బాత్‌ రూమ్‌లో స్నానం చేయడం చూసేందుకు వెబ్ క్యామ్ అమర్చాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. రమేష్(పేరు మార్చబడింది) తంజావూరు సౌత్ రోడ్డుకి చెందినవాడు. అతడు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో సహాయకుడిగా పనిచేస్తున్నారు. అతని భార్య, కూతురు ఉన్నారు. అయితే గత శుక్రవారం వారి బాత్రూమ్‌లో ఏదో మెరుస్తున్నట్టుగా రమేష్ భార్య గుర్తించింది. ఈ విషయాన్ని రమేష్‌కు చెప్పింది.

    దీంతో రమేష్ వెంటనే బాత్రూమ్ వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ వెబ్‌ క్యామ్ ఉన్న విషయాన్ని రమేష్ గుర్తించాడు. వెబ్ క్యామ్ చార్జ్ తగ్గకుండా పవర్‌ బ్యాంకుతో జత చేసినట్టుగా కనుగొన్నాడు. ఈ ఘటనతో రమేష్ పూర్తిగా షాక్ తిన్నారు. ఇందుకు సంబంధించి రమేష్.. తంజావూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రమేష్ ఇంటికి సమీపంలో ఉండే నాసిర్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.

    ఇందుకు సంబంధించి రమేష్ మాట్లాడుతూ.. ‘నా ఇంటి సమీపంలో నివసిస్తున్న నాసిర్ అహ్మద్‌కు భార్య, ఆరేళ్ల కూతురు ఉన్నారు. అతడి తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని భార్య సివిల్ సర్వెంట్. గత కొన్ని సంవత్సరాలుగా అతడు నా భర్య, కూతురు స్నానం చేస్తున్నప్పుడు టెర్రస్‌పై నుంచి చూశాడు. ఈ విషయాన్ని అతడి తండ్రికి చెప్పడం జరిగింది. దీంతో అతడు మాతో గొడవకు వచ్చాడు’అని తెలిపాడు.

    ఇక, తన బాత్రూమ్ ఇంటి వెనక భాగంలో ఉందని రమేష్ చెప్పాడు. బాత్రూమ్ పక్కన ఖాళీగా ఉన్న ఇల్లు మరొకరిదని తెలిపాడు. బాత్రూమ్‌లో స్నానం చేసేవారిని చూసేలా నాసర్ వెబ్ క్యామ్ అమర్చాడు.. అందులో చార్జ్ తగ్గకుండా పవర్ బ్యాంకు కూడా అటాచ్ చేశాడని రమేష్ చెప్పాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నాసిర్ అహ్మద్‌ను విచారిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Tamil nadu

    తదుపరి వార్తలు