హోమ్ /వార్తలు /క్రైమ్ /

నిర్మానుష్య ప్రాంతంలో చేతులు, కాళ్లు కట్టేసి దారుణం.. ఆ పరిచయమే..

నిర్మానుష్య ప్రాంతంలో చేతులు, కాళ్లు కట్టేసి దారుణం.. ఆ పరిచయమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పారిశుద్ద్య కార్మికురాలిగా పనిచేస్తున్న రేవతికి.. అక్కడే పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన తిమ్మప్పతో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది.

  ఓ వివాహితకు మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ క్రమంలోనే ఓ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతడు మహిళను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై వానగరం శక్తిసాయి రామ్‌నగర్‌కు చెందిన మురుగన్, రేవతి దంపతులు. రేవతి.. చెన్నై కార్పొరేషన్ మండల కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. ఆమెకు అక్కడే పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన తిమ్మప్పతో పరిచయం ఏర్పడింది. రేవతి, తిమ్మప్పల మధ్య పరిచయం కొద్ది రోజుల్లోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు తరుచూ కలుస్తుండేవారు.

  ఇక, ఈ నెల 16వ తేదీన తిమ్మప్ప.. రేవతి వద్ద నుంచి ఐదు సవర్ల బంగారు నగ తీసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు 22వ తేదీన నిర్మానుష్య ప్రాంతంలో కలుసుకన్నారు. ఈ సందర్భంగా తన వద్ద తీసుకున్న నగ గురించి రేవతి తిమ్మప్పను అడిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశానికి లోనైన తిమ్మప్ప.. రేవతి చున్నీతో ఆమెనే చేతులు, కాళ్లు కట్టేశాడు. అనంతరం ఆమె గొంతుకోశాడు.దీంతో రేవతి అక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తిమ్మప్ప.. రేవతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

  ఇక, మంగళవారం సాయంత్రం చెన్నై నోలంబోర్ బైపాస్ రోడ్డులో కాలుతున్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ మృతదేహం రేవతిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు తిమ్మప్పను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Extra marital affair, Tamil nadu

  ఉత్తమ కథలు