Chennai: ఆత్మహత్య చేసుకుందామని బ్రిడ్జి మీద నుంచి స్పీడ్ గా వెళ్తున్న కార్ల మీదకు దూకేశాడు.. ఆ తర్వాతే ఊహించని ఘటన జరిగింది..!

కారు మీద వ్యక్తి పడిన దృశ్యం (Image Credit: Twitter)

ఓ కారుపై ఏదో పెద్ద వస్తువు పడినట్టు శబ్దం వచ్చింది. వెంటనే కారు డ్రైవర్ కారును ఆపాడు. ఏంటా అని చూస్తే ఓ మనిషి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఉన్నవాళ్లు అక్కడకు చేరుకున్నారు. అసలేం జరిగిందంటే..

 • Share this:
  మహానగరం. రయ్యిరయ్యిమంటూ కార్లు యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. ఓవర్ టేక్ చేసి మరీ తొందరగా గమ్యం చేరుకోవాలన్న యత్నంతో రోడ్లపై వాహనదారులు వెళ్తున్నారు. ఇంతలోనే సడన్ గా ఊహించని సంఘటన జరిగింది. ఓ కారుపై ఏదో పెద్ద వస్తువు పడినట్టు శబ్దం వచ్చింది. వెంటనే కారు డ్రైవర్ కారును ఆపాడు. ఏంటా అని చూస్తే ఓ మనిషి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఉన్నవాళ్లు అక్కడకు చేరుకున్నారు. ఆ ఘటన జరిగిన చోటే పైన ఓ బ్రిడ్జి ఉంది. ప్రయాణికులు రోడ్డును దాటేందుకు కట్టిన బ్రిడ్జ్ అది. దానిపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అతడిని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత విచారిస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లాకు చెందిన మరిముత్తు అనే 34 ఏళ్ల వ్యక్తి చెన్నైలోని ఓ బిర్యానీ పాయింట్లో పనిచేస్తున్నాడు. కాస్త పని ఉందనీ, ఇంటికి వెళ్లాలని రెండు రోజుల క్రితం యజమానికి చెప్పాడు. సెలవు తీసుకున్నాడు. యజమాని కూడా సరేననడంతో ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్న సమయంలోనే శనివారం బ్రిడ్జి మీద నుంచి కారు మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని వెంటనే రాజీవ్ గాంధీ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు.
  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మరిమత్తు వద్దకు వెళ్లి వివరాలు అడిగితే అతడు నిజాలు వెల్లడించాడు. ’నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాను. అందుకే ఇంటికి వెళ్తానని యజమానితో చెప్పి వచ్చాను. రోడ్డు పక్కన నిల్చుని కార్ల కింద పడితే ఎవరైనా ఆపుతారేమోననిపించింది. అందుకే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాను. ఏదైనా కారు నన్ను ఢీకొడితే వెంటనే చనిపోవచ్చనుకున్నా’ అంటూ అతడు నిజాలు చెప్పాడు. దీంతో అసలేం జరిగిందో తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రమాదవశాత్తు కిందపడ్డాడని అనుకుంటే, అతడే పడ్డాడా? అని తెలిసి షాకయ్యారు. అతడి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..
  Published by:Hasaan Kandula
  First published: