హోమ్ /వార్తలు /క్రైమ్ /

మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం.. క్షణికావేశంలో ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా..

మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం.. క్షణికావేశంలో ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా..

(file photo)

(file photo)

Crime news: మద్యం రెండు కుటుంబాల మధ్య తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరు స్నేహితులు తాగిన మైకంలో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత.. ఇది కాస్త కత్తిపోట్లకు దారితీసింది.

Tamil nadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య మద్యం తీరని శోకాన్ని మిగిల్చింది. అంతియూర్ పరిధిలో సతీష్, కార్తీక్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరు వ్యాన్ నడుపుతుండే వారు. ఒక రోజు సతీష్ వ్యాన్ ను నడిపాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు. కానీ ఎవరికి గాయాలు కాలేదు. అప్పుడు భయపడి వ్యాన్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇది కాస్త.. కార్తీక్ కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వీరిద్దరు.. కలిసి మద్యం తాగారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.

ఈ క్రమంలో.. కార్తీక్, సతీష్ ను హత్యచేసి పారిపోయాడు. ఆ తర్వాత.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇక.. కార్తీక్ వ్యవహారం కొంత అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని అదుపులోనికి తీసుకుని విచారించారు. దీంతో కార్తీక్ నేరాన్ని అంగీకరించాడు. సతీష్ ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇలాంటి కోవకు చెందిన..  ఒక క్రైమ్  తెలంగాణలో జరిగింది. ఇద్దరు స్నేహితులు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఒకరు అనుకోకుండా పట్టాల మీద విగత జీవిగా కనిపించాడు. దీంతో మరో వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతను ఆత్మహత్యకు యత్నించాడు.

పూర్తి వివరాలు.. మంచిర్యాల జిల్లాకు చెందిన సాగర్, మహేందర్ మంచి స్నేహితులు. సాగర్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత నెలలో తాండురులో కాసిపేట గ్రామంలో.. మహేందర్ రైల్వే పట్టాల మీద చనిపోయి కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని తల్లిదండ్రుల మాత్రం తమ కుమారుడిని హత మార్చారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో .. పోలీసులకు పలు వీడియోలు లభించాయి.

ఒక వీడియోలో.. మహేందర్ గ్రామంలోని, వేరే వ్యక్తితో గొడవ పడుతున్నట్లు అందులో రికార్డు అయ్యింది. వీరిని సాగర్ అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో రాజయ్య.. మహేందర్ ను దూరంగా నెట్టివేశాడు. అప్పుడు.. మహేందర్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత సాగర్ మంచిర్యాల నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. ఇక్కడే క్యాబ్ నడుపుతున్నాడు. తాజాగా, ఈ కేసు విచారణలో భాగంగా స్టేషన్ కు రావాలని పోలీసులు అతనికి ఫోన్ చేశారు. దీంతో సాగర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికిస్తారని భావించాడు. ఒక సెల్ఫీ వీడియో తీసుకుని హెయిర్ డై తాగేశాడు. వెంటనే అతడిని తోటి మిత్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనిపై మంచిర్యాల పోలీసులు వివరణ ఇచ్చారు. కేవలం విచారణ చేయడానికి మాత్రమే రమ్మని కోరామని, వేధించడానికి కాదని తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Tamil nadu

ఉత్తమ కథలు