ఆలుమగలన్నాక గొడవలు కామన్. కొందరు పెళ్లైన (Wedding) తర్వాత.. అతిగా ప్రవర్తిస్తుంటారు. కొందరికి మద్యం తాగుడు అలవాటు ఉంటుంది.పెళ్లైన తర్వాత.. దీన్ని మానుకుంటారు. కానీ కొందరు మాత్రం మాకేంటీ అన్నట్లు వ్యవహారిస్తుంటారు. సంపాదించిదంతా తాగుడుకు (Drinker) తగలేస్తారు. దీనికి భార్యలు అడ్డుతగిలితే.. వారిపై కూడా దాడులు చేస్తారు. భార్య దాచిన సొమ్మును కూడా తాగుడుకు ఖర్చుచేస్తారు. మద్యానికి బానిస కావడం వలన కుటుంబాలే (Family disputes) రోడ్డున పడిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిచోట్ల ఫులుగా తాగి రోజు భార్యలను.. భర్తలు కొడుతుంటారు. కొంత మంది ఓపిగ్గా భరిస్తారు. మరి కొందరు మాత్రం తిరగబడతారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. తమిళనాడులో (Tamil nadu) స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఈ ఘటన జరిగింది. విల్లుపురంలోని జయం కొండన్ అనే గ్రామంలో ఉదంతం చోటు చేసుకుంది. నటరాజన్ అనే వ్యక్తి రోజు (Drinker husband) తాగే వాడు. తాగి ఇంటికి వచ్చి.. భార్యను నోటి కొచ్చినట్లు తిట్టి చావబాదేవాడు. ఇద్దరి మధ్యలో రోజు నటరాజన్ తాగడం వలన ప్రతి రోజు గొడవలయ్యేవి. భార్య ఎన్నో రోజుల పాటు ఓపిక పట్టింది. కానీ మొగుడి టార్చర్ మరీ ఎక్కువ కావడంతో ఇక తట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో జూన్ 13 న రాత్రి కూడా నటరాజన్ తాగి ఇంటికి వెళ్లాడు. రోజులాగే పెళ్లాంతో గొడవ పెట్టుకున్నాడు.
అప్పటికే మాంచి తిక్కమీద ఉన్న అతగాడి భార్య.. సల సల కాగుతున్న రసాన్ని మొగుడి (hot Rassam) మీద విసిరికొట్టింది. దీంతో అతను భయంతో బైటకు పరుగులు పెట్టాడు. తాగిన మత్తులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. నా భార్యను (Man protest outside police station) అరెస్టు చేయాలని కోరాడు. మొదట ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొవాలని పోలీసులు అతడికి సూచించారు. పోలీసులు పట్టించుకొక పోవడంతో అతను.. తిండివనం-కృష్ణగిరి చౌరస్తా చేరుకున్నాడు. అక్కడ కూడా తన భార్యమీద చర్యలు తీసుకొవాలని గట్టిగా అరిచాడు. రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్న అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మత్తు దిగాక ఇంటికి వెళ్లిపోయాడు. అతను ఎలాంటి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media) వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.