Home /News /crime /

TAMIL NADU MAN STABS CLASS 11 GIRL 14 TIMES FOR SPURNING LOVE PROPOSAL ACCUSED FOUND DEAD PAH

Love Affair: ప్రియురాలికి సర్ ప్రైస్.. ప్రేమలో పడ్డ రోజే.. నడిరోడ్డు మీద 14 కత్తి పోట్లు.. అసలేం జరిగిందంటే..

ఘటన స్థలంలో పడిఉన్న యువతి

ఘటన స్థలంలో పడిఉన్న యువతి

Tamil Nadu: యువకుడు ఇంటర్ యువతిని ప్రేమించాడు. తనను ప్రేమించాలని కొంత కాలం వెంటపడ్డాడు. అతగాడి వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొంత మంది యువకులు ప్రేమించిన వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ ప్రేమను రిజెక్ట్ చేశారని ఎంతటి దారుణాలు (Love tragedy)  చేయడానికైన వెనుకాడటం లేదు. కొంత మంది మొదట ప్రేమను అంగీకరించి, ఆతర్వాత వారిని పెళ్లి ప్రస్తావన తెగానే మాట మారుసున్నారు. మరికొంత మంది, ప్రేమను తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రేమ ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు  గతంలో అనేకం జరిగాయి. తాజాగా,ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులో (Tamil nadu) అమానుష ఘటన చోటు చేసుకుంది. తిరుచ్చిలోని అతికుళంలో ఈ దారుణం జరిగింది. స్థానికంగా ఉండే కేశవన్ అనే 22 ఏళ్ళ యువకుడు, ఇంటర్ చదివే యువతిని (Love)  ప్రేమించాడు. గత రెండెళ్లుగా ఆమెను వెంబడిస్తున్నాడు. పలుమార్లు తనను ప్రేమించాలని యువతిని కోరాడు. ఈ క్రమంలో యువతి (love propose) అతగాడి ప్రేమను నిరాకరించింది. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి (Girl friend) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కేశవన్ ను అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. మరల యువతి కోసం వెతికాడు.

యువతి కాలేజ్ నుంచి బయటకు వస్తుండగా చూసి ఆమె కోసం వేచిచూశాడు. ఆమెను తొలిసారి చూసిన రోజు కావడంతో ఆమె దగ్గరకు వెళ్లాడు. తన ప్రేమను రిజెక్ట్ చేసినందుకు ఆమెతో వాగ్వాదానికి వెళ్లాడు. అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. యువతి రక్తపు మడుగులోన రోడ్డుమీద కుప్పకూలిపడిపోయింది. ఆ తర్వాత స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాలికను చూసిన వైద్యులు దాదాపు.. 14 కత్తిపోట్లకు గురైందని తెలిపారు. ఆమె పొట్టంతా కత్తిగాట్లతో ఛిద్రమైపోయింది. ప్రస్తుతం బాలిక చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు కేశవన్ అక్కడే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా ఒక కన్న తల్లి తన బిడ్డను చెత్త బుట్టలొ వేసేసింది.

ముంబైలో (Mumbai) అమానుషమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. 41 ఏళ్ళ నిండు గర్భిణి తన భర్తలో గొడవలు పడి ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె టాయ్ లేట్ లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత.. క్రూర మృగాలు సైతం చేయని విధంగా ప్రవర్తించింది. బాలుడు ఏడుస్తున్న కూడా లెక్కచేయకుండా అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి హోస్ కీపింగ్ సిబ్బంది గదులను శుభ్రం చేయడానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఏడ్పులు వినిపించింది.

అక్కడ ఉన్న గదులన్ని వెతికారు. చివరకు టాయ్ లెట్ డస్ట్ బిన్ లో నవజాత శిశువును కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మగ శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. సీసీ పుటేజ్ ఆధారంగా మహిళను గుర్తించినట్లు సమాచారం. కేవలం అత్తింటివారితో గొడవలతో మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సదరు మహిళ ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Love affiar, Tamil nadu

తదుపరి వార్తలు