Tamil Nadu: తమ తండ్రి చనిపోయాడని అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఆ తర్వాత.. ఇంటికి వచ్చేశారు. ఈ క్రమంలో తెల్లవారే సరికి తమ తండ్రి సజీవంగా ఇంటికి నడుచుకుంటు రావడం చూసి ఇంట్లో వారంతా షాక్ కు గురయ్యారు.
Tamil nadu Man returns home alive 24 hours: ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని సార్లు ఇవి ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బనగలద్ పూర్ కు చెందిన మూర్తికి (55) ఏళ్లు. ఈయన దినసరి కూలీ గా పనిచేస్తున్నాడు. ఇతను కొన్ని రోజుల క్రితం పనిమీద తిరూవూరు కు వెళ్లాడు.
అప్పుడు మూర్తి బంధువుల నుంచి అతని కుమారుడు కార్తిక్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తండ్రి ఇక్కడ బస్టాండ్ లో చనిపోయి ఉన్నాడని తెలిపారు. దీంతో అతను కంగారు పడిపోయి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు . పోస్ట్ మార్టం తర్వాత.. బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో.. కార్తీక్ తన తండ్రికి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశాడు. కన్న తండ్రి చనిపోయాడన్న బాధను భరించలేక పోయాడు.
తనను ఇన్నేళ్లు పెంచిన తండ్రి దూరం కావడంతో కుప్పకూలిపోయాడు. కళ్ల ముందే పనికి వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారాడని తెలిసి కుటుంబం అంతా దుఖంలో మునిగి పోయారు. చివరకు బంధువులు, స్నేహితుల మధ్య తన తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వారంతా ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు తెల్లవారు జామున కార్తిక్ కుటుంబ సభ్యులకు షాకింగ్ ఘటన ఎదురైంది. తమ కళ్లతో తామే నమ్మలేని ఘటన జరిగింది. తన తండ్రి మూర్తి సజీవంగా ఇంటికి నడుచుకుంటూ వచ్చాడు. దీంతో వారంతా భయపడిపోయారు.
ఆ తర్వాత తేరుకుని.. తమ తండ్రి అని కన్ఫామ్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను వెళ్లి కలిశారు. పోలీసులు అతని మృత దేహం ఖననం చేసిన ప్రాంతానికి వెళ్లి శవపరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బహుషా అది వేరే వారి శవం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పలువురు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.