హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hijab row verdict: కర్ణాటక హైకోర్టు సీజేను చంపుతామంటూ బెదిరింపులు.. తమిళనాడు జమాత్ సభ్యులపై కేసు

Hijab row verdict: కర్ణాటక హైకోర్టు సీజేను చంపుతామంటూ బెదిరింపులు.. తమిళనాడు జమాత్ సభ్యులపై కేసు

కర్ణాటక హైకోర్టు సీజే అవస్థి

కర్ణాటక హైకోర్టు సీజే అవస్థి

హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పిన బెంచ్ కు నేతృత్వం వహించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీని చంపేస్తామంటూ తమిళనాడుకు చెందిన తౌహీద్ జమాత్( (TNTJ) అనే సంస్థ బెదిరింపులకు పాల్పడింది.

దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీసిన కర్ణాటక హిజాబ్ వివాదంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదంటూ, కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు తీర్పును కొన్ని ముస్లిం అనుబంధ సంఘాలు వ్యతిరేకిస్తోన్న క్రమంలో.. జడ్జిలకు బెదిరింపులు వచ్చాయి. హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పిన బెంచ్ కు నేతృత్వం వహించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీని చంపేస్తామంటూ తమిళనాడుకు చెందిన తౌహీద్ జమాత్( (TNTJ) అనే సంస్థ బెదిరింపులకు పాల్పడింది. ఈ నేరానికిగానూ తౌహీద్ జమాత్ కు చెందిన ముగ్గురు సభ్యులపై కేసు నమోదైంది.

హిజాబ్ వివాదంలో కర్ణాటక హైకోర్టు తీర్పు న్యాయంగా లేదని తమిళనాడు తౌహీద్ జమాత్ ఆరోపించింది. ఆ సంస్థ అధికార ప్రతినిధి రహ్మతుల్లాతోపాటు మరో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. హిజాబ్ తీర్పు తర్వాత కొరిపాళయం ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో తౌహీద్ జమాత్ సభ్యులు జడ్జిలను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తులను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందిన క్రమంలోనే అరెస్టు చేశామన్నారు.

Hijab Row: సంచలన తీర్పు.. హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేత

గతంలో ఓ తప్పుడు తీర్పు ఇచ్చిన జార్ఖండ్ జడ్జిని మార్నింగ్ వాక్ చేస్తుండగా జీపుతో గుద్దించారని గుర్తుచేస్తూ.. కర్ణాటక హైకోర్టు జడ్జికి కూడా అదే గతి పడుతుందని, జడ్జిగారు మార్నింగ్ వాక్ ఎక్కడికి వెళతారో అందరికీ తెలుసని జీఎన్టీజే సంస్థ ప్రతినిధులు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయవాది ఉమాపతి శనివారం ఫిర్యాదు చేశారు.

CM KCR: కేసీఆర్ రాజ్యసభకు పంపబోయేది వీరినేనా? -జాబితాలో వినోద్, మోత్కుపల్లి, పొంగులేటి ఇంకా..

ఫిర్యాదును అనుసరించి, మధురై పోలీసులు ముగ్గురు TNTJ కార్యకర్తలపై సెక్షన్లు 153 (a) (గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505 (1) (c) (హింసను ప్రేరేపించే ఉద్దేశ్యం), 505 (2), 506 (1) (నేరమైన) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపు) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

PM Modi భారీ ప్రకటన.. భారత్‌లో జపాన్ రూ.3.2లక్షల పెట్టుబడులు.. కిషిడాతో శిఖరాగ్ర సదస్సు

విద్యా సంస్థల్లో హిజాబ్ యూనిఫామ్ మాత్రమే ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై అభ్యంతరం చెప్పలేమని, హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం తప్పనిసరి నియమం కాబోదని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గత మంగళవారం తీర్పు చెప్పింది. కాగా, కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలైంది.

Published by:Madhu Kota
First published:

Tags: High Court, Hijab, Karnataka, Tamil nadu

ఉత్తమ కథలు