కొందరు చేసే పాడు పనులు చూస్తే మతులు పోవాల్సిందే. కోయంబత్తూరుకు చెందిన వ్యక్తి చేసిన పాడు పని చూస్తే మీరు షాక్ తింటారు. వీడికి ఇదేం పోయె కాలం అంటారు. ఇరుగు పొరుగు వారి బాత్ రూంల్లో ప్రవేశించి అక్కడ ఉన్న మహిళల లోదుస్తులను పాడు చేస్తున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. పొరుగిల్లలోని బాత్రూముల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లోదుస్తులను పాడుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొట్టుచెర్రికి చెందిన 38 ఏళ్ల సుందర్రాజు కోయంబత్తూర్‌లోని ఒక్కిలిపాళియంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో రూము తీసుకుని తోటి కార్మికులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఏం పాడు రోగం పుట్టిందో కానీ.. ఐదు రోజుల నుంచి వింతగా ప్రవర్తించేవాడు. ఆ వింత ప్రవర్తనతో గత ఐదు రోజుల నుంచి పొరుగిల్లలోని బాత్రూమ్ ల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లో దుస్తులను పాడు చేయడం మొదలు పెట్టాడు.
చేసిన పాడు పని ఊరికే పోతోందా. సుందర్రాజు వెకిలి చేష్టల్ని కొందరు మహిళలు గమనించారు. దీంతో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర్రాజును అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో తమిళనాడులో నలుగురు దుండుగులు రెచ్చిపోయారు. ఓ బంగారం వ్యాపారి కుటుంబ సభ్యులను హత్య చేయడమే కాకుండా..ఏకంగా 17 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..మయిళదుతురాయ్ జిల్లాలోని సిర్కాళీ రైల్వే రోడ్డులో నివసించే ధన్‌రాజ్(51).. బంగారం వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఓ నలుగురు దుండగులు అతడి ఇంట్లోకి ప్రవేశించి.. ధన్‌రాజ్ భార్య ఆశ(42), అతని కుమారుడు అఖిల్(24)ను హత్య చేసి 17 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఎటువంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను కూడా నిందితులు తీసుకువెళ్లారు. అయితే, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుల్లో ఒకర్ని ఎన్ కౌంటర్ చేశారు. మిగతా ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారు దోచుకున్న 17 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఈ ఉదంతం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను నార్త్ ఇండియన్స్‌గా గుర్తించారు.
Published by:Sridhar Reddy
First published:January 27, 2021, 19:58 IST