• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TAMIL NADU MAN AND WOMAN FOUND DEAD IN LAKE OVER ILLICIT AFFAIR NEAR SALEM SU

పెళ్లైన వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం.. ఇరు కుటుంబాల్లో గొడవలు.. చివరకు చెరువులో షాకింగ్ సీన్..

పెళ్లైన వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం.. ఇరు కుటుంబాల్లో గొడవలు.. చివరకు చెరువులో షాకింగ్ సీన్..

ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికి ఇదివరకే పెళ్లైంది. అయితే ఓ సందర్భంగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది.

  • Share this:
    వారిద్దరికి ఇదివరకే పెళ్లైంది. అయితే ఓ సందర్భంగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇరుకుంటుబాల్లో గొడవలు చేలరేగాయి. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు..సేలం సమీపంలోని ఎస్ పాపరపట్టి చెరువులో ఆదివారం ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. అనంతరం ఇందుకు సంబంధించి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పురుషుడిని సేలం జిల్లా మకుటంజావడి సమీపంగల కూడలూరు గ్రామానికి చెందిన శేఖర్‌ (26), మహిళని నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన గోపాల్‌ భార్య గోమతి (30)గా గుర్తించారు.

    వీరిద్దరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక, శేఖర్‌కు కొన్నేళ్ల కిందట సుమతి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు శేఖర్ పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలో గోపాల్ భార్య గోమతితో శేఖర్‌కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేత సంబంధానికి దారితీసింది.

    ఈ విషయం శేఖర్, గోమతి కుటుంబాల్లో తెలియడంతో ఇరు కుటుంబాల్లో గొడవలు చెలరేగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన వీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఎస్‌ పాపరపట్టి చెరువులో దూకి చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక, శేఖర్, గోమతి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు