హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్యను రేప్ చేసేందుకు ఫ్రెండ్స్‌కు పర్మిషన్ ఇచ్చిన భర్త.. ఏకంగా ఇంటికే పిలిచాడు.. అసలు ఏం జరిగిందంటే..

భార్యను రేప్ చేసేందుకు ఫ్రెండ్స్‌కు పర్మిషన్ ఇచ్చిన భర్త.. ఏకంగా ఇంటికే పిలిచాడు.. అసలు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి తన భార్యను మానసిక వేధనకు గురిచేశాడు. తన స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. భార్యను రేప్‌ చేయాల్సిందిగా స్నేహితులను ప్రేరేపించాడు.

  భార్యను కాపాడాల్సిన భర్తే.. ఆమెను నీచపు పని చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. తన స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు పోలీసుల స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎల్ఆర్ పాలయం‌లో నివాసం ఉంటున్న మధుసూదన్‌(పేరు మార్చడం జరిగింది)కు 2018లో 21 ఏళ్ల పార్వతి(పేరు మార్చడం జరిగింది)తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే మధుసూదన్ మద్యానికి బానిసగా మారాయి. కోవిడ్-19 పరిస్థితుల కారణంగా గత ఏడాది కాలంగా సరైన పనిలేదు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో మధుసూదన్ తన ఇద్దరు స్నేహితులు సుందరమూర్తి(25), మణికందన్(26)ల వద్ద పలు సందర్భాల్లో అప్పు చేశాడు. అయితే రోజులు గడస్తున్నప్పటికీ మధుసూదన్ అప్పు చెల్లించలేదు. ఈ క్రమంలోనే అప్పు తీర్చలేకపోయిన మధుసూదన్.. తన భార్యపై అత్యాచారం చేయమని స్నేహితులకు ఆఫర్ చేశాడు.

  ఈ క్రమంలోనే మధుసూదన్ తన భార్యకు విటమిన్ ట్యాబ్లెట్ అని చెప్పి.. ఓ మాత్ర ఇచ్చాడు. అయితే భర్త మాటలు నమ్మి ఆ ట్యాబ్లెట్ వేసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత స్నేహితుడు సుందరమూర్తిని.. తన భార్యపై అత్యాచారం చేసేందుకు పిలిపించాడు. ఇక, భ‌ర్త నీచాన్ని గ్ర‌హించిన బాధితురాలు అత‌డిని తీవ్రంగా మంద‌లించింది.

  మరో సందర్భంలో మధుసూదన్.. తన స్నేహితుడు మణికందన్‌ను ఇంటికి పిలిచాడు. వారిద్దరు డ్రింక్స్ తాగిన తర్వాత.. నిద్రపోతున్న తన భార్యను రేప్ చేయాలని మణికందన్‌కు చెప్పాడు. దీంతో మణికందన్ పార్వతి వద్దకు చేరాడు. అయితే పార్వతి మేలుకవ రావడంతో.. ఏం జరుగుతుందో తెలుసుకుని ఆందోళన చెందింది. వెంటనే అతడిని ప్రతిఘంటించింది. దీంతో మణికందన్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పార్వతి తన భర్తపై దాడి చేసింది.

  షాకింగ్.. పదేళ్ల బాలికపై ఏడుగురి అత్యాచారం.. బాలిక తండ్రి వీడియో చూడటంతో వెలుగులోకి.. నిందితుల్లో ఒక్కరు తప్ప..


  మైనర్ బాలికతో సహజీవనం.. రక్షణ కోరిన జంట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

  Telangana: పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు.. ఎవరితోనైనా లేచిపో.. సొంత వదినే అలా అనడంతో..

  ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన పార్వతి.. తన కొడుకును తీసుకుని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అయినప్పటికీ మధుసూదన్ ఆమెను వేధించడం ఆపలేదు. ఆమె వద్దకు వెళ్లి.. తన స్నేహితులకు సహకరించాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలోనే పార్వతి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అతడి ఫ్రెండ్స్ పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Tamil nadu

  ఉత్తమ కథలు