Crime : ఈ ఫోటోలో మహిళ పద్దతిగా ఉంది కదా అనుకుంటే పొరపాటే..ఈ మాయలేడి లీలలు అన్నీ ఇన్నీ కావు..

ఈ ఫోటోలో మహిళ పద్దతిగా ఉంది కదా అనుకుంటే పొరపాటే..

Crime : ఇటీవల నిత్య పెళ్లి కూతుళ్ల అరాచకాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. చాలా చోట్ల రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న తరువాత.. అరాచకాలు బయటకు వస్తున్నాయ్ ఇలాంటి కేసులు ఎన్నో రోజూ వింటూ ఉన్నాం.

  • Share this:
    సాధారణంగా పెళ్లిలు ఒకరు ఒకటి చేసుకుంటారు..జీవితానికి దీన్నే పరమ పవిత్రంగా భావిస్తారు..ఇక పరిస్థితులు అనుకూలించక పోతే రెండో పెళ్లి చేసుకుంటారు....లేదంటే అదికొద్ది మాత్రమే మూడొ పెళ్లికి సిద్దమవుతారు..అదికూడ ఏ నలబై లేదా యాబై సంవత్సరాలకో తమ జీవిత చివరి అంకంలో తోడు కావాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటారు...కాని ఓ మహిళ మాత్రం ఎవ్వరు ఊహించని పని చేసింది..పెళ్లంటే నూరేళ్లు కాదు..కొద్ది రోజుల పంట అంటూ వ్యవహరించింది..ఇలా పెళ్లినే తన ప్రవృత్తిగా మార్చుకున్నారు..దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4పెళ్లిల్లు చేసుకుంది.మాయమాటలతో మగవాళ్లను ముగ్గులోకి దింపి.. పని పూర్తవగానే వారికి హ్యాండివ్వడం ఈమె స్టైల్‌. ఇప్పటివరకు నలుగురిని పెళ్లి చేసుకుంది. ఎంతోమందికి టోకరా వేసింది. వివరాల్లోకి వెళ్తే.. కరూర్‌ జిల్లాకు చెందిన సౌమ్య.. రామనాథపురం జిల్లాకు చెందిన పోలీస్‌ సురేష్‌ను మూడో పెళ్లి చేసుకుంది. అతని పేరుతో డబ్బులు వసూలు చేసింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగిన ఫొటోలు చూపించి..లక్షల రూపాయలు దోచేసింది. ఆ తర్వాత సురేష్‌కు హ్యాండిచ్చి సేలంలో శ్రీనివాసన్‌ను మ్యారేజ్‌ చేసుకుంది.

    మంత్రులు, ఎమ్మెల్యేల బంధువునంటూ బురిడీ కొట్టిస్తోంది ఈ వగలాడి. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు టోకరా వేసింది. జాబ్స్‌ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఎన్నో ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురుచూసిన బాధితులు..ఎంతకీ జాబ్స్‌ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ మాయలేడి బాగోతాలన్నీ బయటికొచ్చాయి. పలు జిల్లాల నుంచి ఈ కిలాడిపై ఫిర్యాదులు రావడంతో..సౌమ్యను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు పోలీసులు.

    సౌమ్య వెనుక ఏదైనా ముఠా ఉందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని మోసాలు..సౌమ్య ఒకటే చేసి ఉండదని వారి అనుమానం. ఆమెకు రాజకీయంగా ఎవరైనా సహకరించి ఉండొచ్చన్న అనుమానం కూడా పోలీసులకు ఉంది. మొత్తానికి సౌమ్య కేసు స్థానికంగా కలకలం రేపింది.
    Published by:Sridhar Reddy
    First published: