అనుమానం పెను భూతంగా మారి.. దారుణ హత్యకు దారితీసింది. కట్టుకున్న భర్తే ఆమెను గొంతకోసి హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసకుంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామానికి చెందిన గోపి(36) బతుకుదెరువు కోసం చెన్నైకి వెళ్లాడు. చెన్నైలోని ఆలందూరులో ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన మహేశ్వరిని ఫిబ్రవరి 14వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే మహేశ్వరికి గతంలో ఇదివరకే పెళ్లి అయింది. అయితే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇక, గోపి, మహేశ్వరిని పెళ్లి చేసుకున్న అనంతరం.. ఆమెతో కలిసి తన స్వస్థలం ఎగువనల్లాటూరులోకి వచ్చాడు. అక్కడే నివాసం ఉండసాగాడు.
ఇక, పెళ్లైయినా కొద్ది రోజులు గోపి, మహేశ్వరిల దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే రెండు రోజుల క్రితం మహేశ్వరి ప్రవర్తనపై గోపికి అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే శనివారం మహేశ్వరితో గోపి గొడవపడ్డారు. భర్త తనను అనుమానించడంతో మనస్తాపం చెందిన మహేశ్వరి.. ఆదివారం ఉదయం ఆలందూర్ వెళ్లిపోతానని చెప్పింది. అయితే మహేశ్వరి అలా చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయిన గోపి ఆమెను హత్య చేశాడు. గొంతు కోసం ఆమెను అంతమొందించాడు.
మహేశ్వరిని హత్య చేసిన అనంతరం గోపి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గోపి చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు అతను ఉంటున్న ఇంటికి వెళ్లి మహేశ్వరి మృతదేహాన్ని గుర్తించారు. అక్కడి వివరాలను సేకరించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక, గోపిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.