Home /News /crime /

TAMIL NADU HEAD CONSTABLE SARAVANAN CHASED A SMUGGLER BY CLINGS TO CAR BONNET FOR 8 KILOMETRES FINALLY CAUGHT HIM NK

వీడేరా పోలీస్.. కారుపై వేలాడుతూ.. 8 కి.మీ. ఛేజ్ చేసి స్మగ్లర్‌ని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్

ప్రాణాలకు తెగించిన హెడ్ కానిస్టేబుల్ (File images credit - twitter)

ప్రాణాలకు తెగించిన హెడ్ కానిస్టేబుల్ (File images credit - twitter)

సరిహద్దుల్లో సైనికులు ఎలాగైతే ప్రాణాలకు తెగిస్తున్నారో... అలాగే ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడారు. స్మగ్లర్‌ను పట్టుకోవడంతో... ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

    వాడో గంజాయి స్మగ్లర్. కారులో పారిపోతున్నాడు. అతన్ని వదిలేస్తే.. ఇంకా ఇంకా ఇలాంటి నేరాలు చేస్తూనే ఉంటాడని గ్రహించిన తిరుచ్చీ హెడ్ కానిస్టేబుల్... శరవణన్... ఛేజ్ చేశారు. కారు బానెట్‌పై ఎక్కిన ఆయన... తన ప్రాణాలకు తెగించారు. ఆ స్మగ్లర్ ఎలాగైనా... ఆయన్ని బానెట్ పై నుంచి కిందకు పడేయాలని కారును వేగంగా నడుపుతూ... అటూ ఇటూ తిప్పుతూ... దూసుకెళ్లాడు. అయినా సరే... శరవణన్ వెనక్కి తగ్గలేదు. ఉడుములా పట్టేసి... పట్టువిడవకుండా పట్టుదలతో దొంగను పట్టుకున్నారు. దీనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

    తిరుచ్చిలో గంజాయి రాకెట్ పెద్ద ఎత్తున సాగుతోందని పోలీసులకు సమాచారం ఉంది. ఓ కారులో గంజాయిని తరలిస్తున్నారని తెలిసింది. మన్నపురం దగ్గర పోలీసులు చెక్ పాయింట్ ఏర్పాటు చేసి ఆదివారం రాత్రి ఆపరేషన్ చేపట్టారు. నిందితుడు 42 ఏళ్ల మహ్మద్ హనిఫా... తమిళనాడులోని పుదుకొట్టాయ్ లోని కీరనూర్ గ్రామానికి చెందినవాడు. పోలీసులు అతన్ని పట్టుకునేలోగా... చెన్నై నేషనల్ హైవే ఎక్కేశాడు. అంతే... 38 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ శవరణన్... వాణ్ని వదలొద్దు... కచ్చితంగా పట్టుకుందాం అంటూ తన టీమ్‌తో యాక్షన్ లోకి దిగారు. ఓ చోట ఆ స్మగ్లర్ కారును బైక్‌తో అడ్డుకున్నారు. కానీ ఆ దొంగ... బైక్‌ని ఢీకొట్టి మరీ వెళ్లిపోతుంటే... ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి... బానెట్ పైకి దూకారు శరవణన్. మరో పోలీస్ కారును ఛేజ్ చేయసాగారు.

    ఇలా 8 కిలోమీటర్లు వెళ్లాక... ఇక ఆ స్మగ్లర్ ఆటలు సాగలేదు. సంజీవినగర్ దగ్గగ దొరికాడు. అతని కారులు కేజీ గంజాయి ఉంది. దాంతోపాటూ కారును కూడా సీజ్ చేశారు. అతన్ని అరెస్టు చేశారు. "కారు ముందు భాగంలో ఎక్కి అలా ఉండటం ప్రాణాలకే ప్రమాదం. నాకు ఓ మెటల్ గార్డ్ చేతికి దొరికింది. దాన్ని బలంగా పట్టుకున్నాను. కారు ఆపమని ఎన్నోసార్లు చెప్పాను. అతను ఎంతకీ ఆపలేదు." అని శరవణన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కుడి మడమకు 30 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

    "ఆ స్మగ్లర్ గంజాయి మత్తులో ఉండి కారు డ్రైవ్ చేశాడు. పారిపోవడమే అతని ఉద్దేశం. కావాలనే పోలీస్‌ని ఇబ్బంది పెట్టాడు. కానీ ఆ హెడ్ కానిస్టేబుల్ చాలా గట్టిగా బానెట్‌ని పట్టుకోవడం ద్వారా తీవ్ర గాయాలు కాకుండా తప్పించుకోగలిగారు. ఆయన ప్రయత్నాలను మేమంతా ప్రశంసిస్తున్నాం" అని తిరుచ్చీ డిప్యూటీ కమిషనర్ శక్తివేల్ తెలిపారు.

    ఇది కూడా చదవండి: E-Cycle: కొత్త ఎలక్ట్రిక్ సైకిల్... రూ.7కి 100 కిలోమీటర్ల మైలేజ్

    శరవణన్ ఇది వరకు కూడా ఇలాంటి చాలా కేసుల్ని సవాలుగా తీసుకొని విజయాలు సాధించారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Tamil nadu, Viral, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు