HOME » NEWS » crime » TAMIL NADU GOVERNMENT BANS ONLINE BETTING GAMES RUPEES 5000 FINE AND JAIL FOR VIOLATORS NK

Online Betting Games: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై నిషేధం... ఆడితే ఫైన్, జైలు

Online Betting Games: కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన చాలా మంది బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు. తీరా చూస్తే... వాటిలో అడ్డంగా మోసపోయి లబోదిబోమంటున్నారు.

news18-telugu
Updated: November 21, 2020, 10:11 AM IST
Online Betting Games: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై నిషేధం... ఆడితే ఫైన్, జైలు
Online Betting Games: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై నిషేధం... ఆడితే ఫైన్, జైలు
  • Share this:
Online Betting Games: "ఎవరైనా సరే... ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నట్లైతే... వారు ఎప్పటికీ డబ్బు సంపాదించలేరన్న విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే... ఆన్‌లైన్ బెట్టింగ్‌ మొత్తం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాముల ద్వారా జరుగుతుంది. బెట్టింగ్ ఆడేవారు ఓడిపోతారే తప్ప... సాఫ్ట్‌వేర్ ఓడిపోదు. మొదట్లో కొంచెం డబ్బు గెలిచేలా చేసి... ఆ తర్వాత మొత్తం డబ్బును లాగేసుకుంటాయి బెట్టింగ్ సాఫ్ట్‌వేర్లు. ఈ విషయాన్ని ఆడేవారు తెలుసుకోవాలి" అంటున్నారు తమిళనాడు పోలీసులు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై నిషేధం విధించింది. ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇకపై అక్కడ ఎవరూ వాటిని ఆడకూడదు. ఆడినా, బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఫైన్, జైలు తప్పవు.

దేశంలోకి కరోనా వచ్చాక.. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. అలాంటి వాళ్లను... మొబైల్ ద్వారానే మనీ సంపాదించుకోండి, ఇంటి దగ్గరే ఉంటూ డబ్బు సంపాదించుకోండి... అంటూ చాలా యాడ్లు ఊరించాయి. వాటిని చూసి... ఇదేదో బాగుంది కదా అని రూ.100, రూ.200 పెట్టి చాలా మంది బెట్టింగ్ సైట్లలో చేరుతున్నారు. తీరా చేరాక... మొదట్లో కాస్త డబ్బు వస్తుంటే... ఇంకా ఎక్కువ సంపాదించాలని... ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. అలా బాగా డబ్బు పెట్టాక... మొత్తం పోతోంది. ఇలా బెట్టింగ్ సైట్లు... సామాన్యులను అడ్డంగా ముంచేస్తున్నాయి. చాలా మంది అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ కడుతున్నవారు... సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కంటే... తమిళనాడులో బాగా ఎక్కువైంది.

సూసైడ్లు, కంప్లైంట్లూ ఎక్కువవడంతో... తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. అడ్డగోలు బెట్టింగ్ సైట్లపై కొరడా విధించింది. ఇకపై ఆ రాష్ట్రంలో ఎవరైనా సరే, కంప్యూటర్లు, మొబైల్స్ వేటితో బెట్టింగ్ ఆడినా.. నేరమే. వారికి రూ.5000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష వేస్తారు. ఎవరైనా సరే బెట్టింగ్ సైట్ నిర్వహించినా, బెట్టింగ్ కార్యకలాపాలు సాగించినా వారికి... రూ.10,000 ఫైన్, 2 ఏళ్ల జైలు శిక్ష తప్పదు.



ఇది కూడా చదవండి: Gang Rape: యువతిపై గ్యాంగ్ రేప్... కారులో తీసుకెళ్లి అమానుషం

ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మనం బెట్టింగ్ ఆడితే... పోలీసులకు తెలియదులే అని ఎవరైనా ఆడితే కూడా పోలీసులు కనిపెట్టగలరు. ఎలాగంటే... బెట్టింగ్ సైట్లకు ఆన్‌లైన్‌లో జరుగుతున్న మనీ ట్రాన్స్‌ఫర్లపై తమిళనాడు పోలీసులు నిఘా పెడుతున్నారు. అందువల్ల ఎవరైనా సరే... బెట్టింగ్ ఆడితే... పోలీసులు ఇట్టే కనిపెట్టగలరు. ఎథికల్ హ్యాకర్లు ఇది 100 శాతం మంచి నిర్ణయం అంటున్నారు. బెట్టింగ్ వల్ల గెలవడం అన్నది ఒక్క శాతం కూడా వీలు కాదనీ... ఆ వెబ్‌సైట్లు రూపొందించేటప్పుడు... సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామే... అలా రాస్తారనీ... అందువల్ల ఎవరైనా సరే... బెట్టింగ్ ఆడితే... మనీ పోవడం గ్యారెంటీ అంటున్నారు. అందువల్ల బ్యాన్ ఉన్నా లేకపోయినా... ఎవరైనా సరే... బెట్టింగ్ సైట్లకు, బెట్టింగ్ గేములకూ దూరంగా ఉండటం మేలు.
Published by: Krishna Kumar N
First published: November 21, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading