Home /News /crime /

TAMIL NADU FISHERWOMAN GANGRAPED FACE BURNED IN RAMESWARAM PVN

Shocking : ముగ్గురు పిల్లల తల్లిపై సామూహిక అత్యాచారం..అనంతరం పెట్రోల్ పోసి కాల్చేశారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fisherwoman gangraped :   తమిళనాడు(Tamilnadu)లో దారుణం జరిగింది.  ఓ వివాహితపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు.

Fisherwoman gangraped :   తమిళనాడు(Tamilnadu)లో దారుణం జరిగింది.  ఓ వివాహితపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో మంగళవారం ఈ దారుణ ఘటన జరిగింది. రామేశ్వరంలోని వడకాడు గ్రామానికి చెందిన 45 ఏళ్ల మత్స్యకార మహిళ వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం చేపల కోసం వెళ్లింది. చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న రొయ్యల ఫామ్‌లో ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయి పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. అది బాధితురాలి మృతదేహం అని తేల్చారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఆమెను నిందితులు గతంలో పలుమార్లు వేధించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆ యువకులను మందలించి వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సముద్రతీరాని కి వెళ్లిన మహిళపై  ఆరుగులు యువకులు అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చీరను మెడకు బిగించి హత్య చేసి, పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

బాధితురాలి హత్యాచారంలో ఆరుగురు వలస కార్మికుల ప్రమేయం ఉందని తెలుసుకున్న బాధితురాలి కుటుంబీకులు, స్థానికులు కలిసి నిందితులు పనిచేస్తున్న ఫాంహౌస్ కు నిప్పంటించా రు. ఆరుగురు యువకులను చితగ్గొట్టారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రామేశ్వరం జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఈ ప్రాంతంలోని రొయ్యల ఫారంలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన ఆరుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.

ALSO READ  Actor shot dead : ప్రముఖ టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

మరోవైపు,ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  దారుణం జరిగింది. బందా పరిధిలోని ఒక బాలిక తన మేనమామ పెళ్లి ఈ నెల 23 న నిశ్చయమైంది. ఈ క్రమంలో బాలిక పెళ్లి వేడుకకు హజరైంది. ఉల్లాసంగా పాల్గొంది. అయితే, ఆమె సమీప బంధువు బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. బాలికను గదిలోనికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి (rape on girl) పాల్పడ్డాడు. ఆతర్వాత.. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది.

amilబాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఏమైందని నిలదీశారు. ఈ క్రమంలో బాలిక జరిగిన దారుణాన్ని తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత నుంచి నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Gang rape, Tamilnadu, WOMAN

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు