• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TAMIL NADU FATHER KILLED DAUGHTER NEAR MADURAI OVER LOVE AFFAIR SU

నర్సు ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం.. నిద్రిస్తున్న సమయంలో దారుణం.. ఆ నేరం చేసింది మరెవరో కాదు..

నర్సు ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం.. నిద్రిస్తున్న సమయంలో దారుణం.. ఆ నేరం చేసింది మరెవరో కాదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించిన పాపానికి ఓ మహిళ నర్సు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సొంతవారే ఆమెను దారుణంగా హత్య చేశారు.

  • Share this:
    ఓ తండ్రి కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఆమె ప్రేమ వ్యవహరం నచ్చని అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు‌లోని మదురై సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. మదురై వండియూరు సంగునగర్‌కు చెందిన ఆశైతంబి ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె మీనాక్షి దేవి(26).. నర్సుగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె జైహింద్‌పురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఇంకా పెళ్లికాలేదు. అయితే కొంతకాలంగా ఆమె ఓ వ్యక్తిని ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన మీనాక్షి దేవి తండ్రి ఆశైతంబి.. ఆమెను మందలించాడు. ప్రేమ వ్యవహారాన్ని కట్టిపెట్టాలని సూచించాడు. అయితే మీనాక్షి దేవి మాత్రం ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూనే వచ్చింది.

    ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించిన మీనాక్షి వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఆశైతంబి కూతురిపై కోపాన్ని పెంచుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని అతడు.. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి మీనాక్షి దేవి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆశైతంబి ఆమెపై దాడి చేశాడు. చపాతి కర్రతో విచక్షణ రహితంగా తలపై బాదాడు. ఈ దాడిలో మీనాక్షి దేవి తలకు తీవ్ర గాయాలు కావడంతో మీనాక్షి దేవి.. అక్కడికక్కడే మృతి చెందింది.

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మీనాక్షి దేవి ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు