హోమ్ /వార్తలు /క్రైమ్ /

Affair: ప్రియురాలితో కలిసి భారీ స్కెచ్.. భార్యకు పూటుగా మద్యం తాగించి.. ఆ తర్వాత..

Affair: ప్రియురాలితో కలిసి భారీ స్కెచ్.. భార్యకు పూటుగా మద్యం తాగించి.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tamil nadu: తమిళనాడులో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యకు డైవర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత.. మరో యువతితో కలిసి సహాజీవనం ప్రారంభించాడు. 

Tamil Nadu Labourer girl friend kill formers wife: ప్రస్తుతం సమాజంలో కొంత మంది వివాహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి అయిన తర్వాత.. కూడా వివాహేతర సంబంధాలతో తమ పరువును బజారుకు ఈడ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల వల వారు సమాజంలో చిన్న చూపుకు గురౌతారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్యపై అనుమానంతో మరో యువతి మోజులో పడ్డాడు. ఆ తర్వాత.. ప్రియురాలితో కలిసి కట్టకున్న భార్యను హతమార్చాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని చిన్న కాంచీపురం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకెళ్లి శ్రీపెరంబుదూర్‌లో పడవేశాడు. దీనికి అతడి ప్రియురాలు సహకరించింది. ప్రస్తుతం వీరిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ చేట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడులో నవీన్ కుమార్, ప్రియలు భార్యభర్తలు. వీరు కూలీ పనులు చేస్తు జీవిస్తుండే వారు. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, నవీన్ కు తరచుగా తన భార్యపై అనుమానం పడేవాడు. తన భార్య పరాయి పురుషులతో చనువుగా ఉంటుందని గొడవ పడేవాడు.ఈ క్రమంలో.. ప్రియ గర్భం దాల్చింది. ఆ తర్వాత ఆమె ఆమె మృతశిశువుకు జన్మనిచ్చింది. అయితే, దీనిపై నవీన్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ప్రియకు పరాయి మగాళ్లతో సంబంధం ఉండేదని అనుమానంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వీరు వేర్వేరుగా ఉండటం ప్రారంభించారు. అప్పుడు నవీన్ కు.. కల్పన అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

కళ్ల ముందే తన భర్త వేరే యువతితో ఉండటాన్ని ప్రియ తట్టుకోలేక పోయింది. వీరిపై అనేక ఆరోపణలు చేసేది. దీంతో నవీన్.. ప్రియతో డైవర్స్ తీసుకున్నాడు. అయిన కూడా.. ప్రియ వీరిని ఎప్పుడు మాటలతో టార్గెట్ చేసేది. కల్పన అక్రమ గంజాయి వ్యాపారం చేస్తుందని ప్రియ పోలీసులకు సమాచారం ఇచ్చింది.దీంతో పోలీసులకు కల్పనను, ఆమె సోదరుడిని అరెస్టు చేశారు. ఇక తన భార్యను ఎలాగైన అంతం చేయాలని నవీన్ , కల్పనలు ప్లాన్ వేశారు ఒక రోజు మాట్లాడుకుందామని నవీన్ , ప్రియను పిలిచాడు.

ఆ తర్వాత.. తన మాజీ భార్యకు పూటుగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉండగా నవీన్, కల్పనలు.. ప్రియ గోంతుకు చున్నీ చుట్టీ హత్యచేశారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లేవరకు కూడా చున్నీని టైట్ గా బిగించారు . ఆ తర్వాత శవాన్ని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోదల్లో పడేశారు. స్థానికులు సమాచారంలో పోలీసులు బాడీని ఆస్పత్రికి తరలించారు. వీరిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో నవీన్ ,కల్పనలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

First published:

Tags: Extra marital affair, Husband harassment, Illegal affair, Tamilnadu

ఉత్తమ కథలు