Married Woman: 5 నెలల క్రితం పెళ్లి.. ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

వనిత

ఆమెకు 5 నెలల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నెల రోజులకే గర్భం దాల్చింది. దీంతో అంతా ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.

  • Share this:
    ఆమెకు 5 నెలల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నెల రోజులకే గర్భం దాల్చింది. దీంతో అంతా ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆమె బాత్‌రూమ్‌లో అనుమానస్పద స్థితిలో మృతిచెంది కనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని(Tamil Nadu) ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని సేలం జిల్లా (Salem District) ఓమలూరు సమీపంలోని వెంగయనూర్‌కు చెందిన వనిత డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు ఐదు నెలల క్రితం ధర్మపురి జిల్లా తోయపూర్ సమీపంలోని మణియతల్లి హిల్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మణిక్కవాసన్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో మణిక్కవాసన్.. సైన్యంలో పనిచేస్తున్నాడని చెప్పారు. అయితే పెళ్లి జరిగి 5 నెలలు గడిచిన అతడు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎలాంటి పనికి వెళ్లలేదు. మరోవైపు వనిత ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉంది. అయితే మణిక్కవాసన్ తరచుగా వరకట్నం(Dowry) కోసం వేధించేవాడు. అయితే మంగళవారం వనిత తల్లి.. కూతురిని చూసేందుకు మణిక్కవాసన్ ఇంటికి వచ్చింది. ఈ సమయంలో మణిక్కవాసన్.. వనితతో పాటు ఆమె తల్లిని కూడా కొట్టినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

    ఇక, బుధవారం ఉదయం వనిత ఆమె ఇంటి సమీపంలోని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకని కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. వనిత మృతిపై ఆమె పుట్టింటివారికి సమాచారం చేరవేశారు. అనంతరం మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) తరలించేందుకు యత్నించారు.

    ఆ మృతదేహం నా కొడుకుదే.. ఆర్మీ జవాన్ తండ్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

    ఇక, అనిత మృతదేహాన్ని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె బంధువులు అడ్డుకున్నారు. వనిత మృతదేహాన్ని చూసి వారు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వనిత మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడున్న కొందరు అంబులెన్స్‌పై దాడి(Attack On Ambulance) చేశారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక, పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌ను అక్కడి నుంచి ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వనిత బంధువులు ఆస్పత్రి వద్ద కూడా నిరసన తెలిపారు. మణిక్కవాసన్‌ను అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు అక్కడి నుంచి కదిలేదే లేదని తెలిపారు. అయితే పోలీసులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

    వనిత-మణిక్కవాసన్


    చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

    అయితే వనిత బంధువులు వారి మాటలను వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు , నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆస్పత్రి వద్దకు చేరుకున్న రెవెన్యూ కమిషన్ బాధితురాలి బంధువులతో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వనిత బంధువులు నిరసనను విరమించుకున్నారు. ఇక, వనిత భర్త మణిక్కవాసన్, అతని కుటుంబ సభ్యులు.. ఆమె మృతదేహాన్ని చూసేందుకు రాలేదు.
    Published by:Sumanth Kanukula
    First published: