ఓ వ్యక్తి తన లివ్ ఇన్ రిలేషన్ భాగస్వామి శీలాన్ని అనుమానించాడు. ఈ క్రమంలోనే ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణిమాలాగా అనే మహిల గత రెండేళ్లుగా సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈ బంధాన్ని ఏర్పరుచుకుంది. అయితే సురేష్.. మణిమాలా క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరు మద్య పలుమార్లు వాదనలు జరిగాయి. బుధవారం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే మరుసటి రోజు ఉదయం నిద్రిస్తున్న సమయంలో మణిమాలను సురేష్ ఆమె చీరనే గట్టిగా గొంతుకు బిగించి హత్య చేశాడు.
అయితే మణిమాల చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు మణిమాలతో సహజీవనం చేస్తున్న సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంబంధింత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఇక, మరో ఘటనలో కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడవద్దని హెచ్చరించిన భార్యను హతమార్చిన మురుగేశన్ (54)కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. వివరాలు.. పుదుకోట్టై సమీపంలోని తేనిపట్టికి చెందిన రైతు మురుగేశన్‌కు ముగ్గురు భార్యలు, పదకొండు మంది పిల్లలు ఉన్నారు. రెండో భార్య భానుమతి కుమార్తె(17)పై మురుగేశన్ లైంగికదాడికి పాల్పడేవాడు. ఈ విషయం తెలిసి అడ్డుచెప్పిన భార్యను తలపై రాయికొట్టి హత్య చేశాడు. కేసును విచారించిన పుదుకోట్టై మహిళా కోర్టు నిందితుడికి ఉరిశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది.