Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంత దారుణమా.. చెవి, ముక్కులో విషాన్ని లోపలికి పంపి.. చివరకు..

ఫైల్ ఫొటోలు

Tragedy Love Story: ప్రేమికులను హత్య చేసిన కేసులో సంచలన తీర్పును వెలువరించింది కడలూరు కోర్టు. అందులో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్‌ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించే సమయంలోనే వారి కులాలు వేరు అన్న విషయం తెలుసుకొనే ప్రేమించుకున్నారు. పెద్దల వద్దకు ఈ ప్రేమ వ్యవహారం తీసుకెళ్లారు. కానీ అందరిలాగే ఆ పెద్దలు కూడా అంగీకరించలేదు. దీంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రహస్య వివాహం చేసుకున్నారు. ఇంకేముంది.. ఇరు కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. అహం దెబ్బతినడంతో ఇరు కుటుంబాల వారూ కూడబలుక్కుని ఆ జంటను అతి కిరాతకంగా హతమార్చారు. నేరం రుజువుకావడంతో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్‌ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ ఘటన కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..


  కులాంతర వివాహం చేసుకున్న జంటను కిరాతకంగా హత్య చేసినందుకు నిందితులకు కఠిన శిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చింది కడలూరు కోర్టు. 12మందికి యావజ్జీవ శిక్ష వేసినవారిలో మాజీ డీఎస్సీ కూడా ఉండటం విశేషం. కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలు అంగీకరిచకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన 25 ఏళ్ల మురుగేశన్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. అతు అదే ప్రాంతానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు 22 ఏళ్లు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

  Crime News: హయత్ నగర్ లో దారుణం.. భార్య శవాన్ని దుప్పటిలో చుట్టి.. చివరకు..


  వేర్వేరు కులాలు కావడంతో ప్రేమను అంగీకరించలేదు. మీరు ఒక వేళ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మాత్రం చంపేస్తామంటూ బెదిరించారు. అయినా వాళ్లు ఇవన్నీ పట్టించుకోకుండా కడలూరు రిజిస్ట్రార్‌ ఆఫీసులో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. ఈ విషయం కొన్నాళ్లకు ప్రేమికుడి కుటుంబసభ్యులకు తెలిసింది. వాళ్లు వేరే దగ్గర ఉంటున్నారన్న సమాచారం తెలుసుకొని.. అందరి ముందు పెళ్లి చేస్తాం.. మాతో వచ్చేయండి అంటూ మురుగేశన్ బాబాయ్ సహకారంతో .. అమ్మాయి తరఫు బంధువులు వాళ్లను తీసుకెళ్లేందుకు వాహనంలో ఎక్కించారు. అక్కడ నుంచి నేరుగా ఇంటికని తీసుకెళ్తూ.. శ్మశానానికి తీసుకెళ్లారు.

  అతడి వద్ద సెక్రటరీగా ఆమె పని చేస్తుంది.. పని ఉందంటూ ప్లాట్ కు రప్పించుకున్నాడు యజమాని.. చివరకు ఇలా జరిగింది..


  అప్పటికే వాళ్లకు అర్థం అయిపోయింది. వీళ్లు మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నారని.. తప్పించుకోవడానికి ప్రయత్నించారు.. కానీ కుదరలేదు. వాళ్లతో పాటు తెచ్చుకున్న విషాన్ని మురుగేశన్ కు మరియు మురుగేశన్ భార్యకు ముక్కు, చెవుల ద్వారా విషాన్ని లోపలికి ప్రవేశపెట్టారు. ఆతరువాత కొద్దిసేపటికే ఇద్దరు చనిపోయారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నతరువాత ఇద్దరి మృతదేహాలను అదే శ్మశానంలో తగులబెట్టారు. ఈక్రమంలో మురుగేశన్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి తరఫు బంధువులు అగ్ర కులస్తులు కావడంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

  Hyderabad Crime: భార్య చనిపోవడంతో ఇంట్లో తండ్రి, కూతురు ఉంటున్నారు.. 15 రోజుల నుంచి కన్న కూతురుపై అతడు..


  కానీ అప్పటికే ఈ విషయం స్థానిక మీడియాలో మార్మోగిపోవడంతో పోలీసులు వేరే దారి లేక కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై వాదోపవాదనలు.. కోర్టు వాయిదాలతో చివరకు మొత్తం 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది.. వీరిలో అమ్మాయి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండు సంవత్సరాల యావజ్జీవ శిక్షలు విధించగా.. 15 మంది నిందితుల్లో మురుగేశన్‌ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టారు.
  Published by:Veera Babu
  First published: