Home /News /crime /

వారిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా ఊహించని పరిణామం.. చివరకు తీరని విషాదం..

వారిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా ఊహించని పరిణామం.. చివరకు తీరని విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది. త్వరలోనే పెళ్లి జరగనుందనే ఆనందంలో ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకునేవారు.. ఈ క్రమంలో ఏర్పడిన గొడవ యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

    కొడుకు వివాహం జరగదనే బెంగ ఓ వైపు.. యువతి తల్లిదండ్రుల బెదిరింపులు మరోవైపు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ దంపతుల జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సేలం జిల్లా ఇలంపిల్‌లై సమీపంలోని పులియంపుట్టికి చెందిన తంగమణి, రత్నం దంపతులకు.. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడి పేరు రాజా అన్నామలై. రాజా అన్నామలై ఏంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా తంగమణి, రత్నం దంపతులు రాజా అన్నామలైకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇందుకోసం బంధువుల సాయం తీసుకున్నారు.

    ఈ క్రమంలోనే ఎ.పుదూరు ప్రాంతానికి చెందిన యువతితో రాజా అన్నామలైకు వివాహం నిశ్చయం చేశారు. పెళ్లి నిశ్చయం కావడంతో అన్నామలై, ఆ యువతి ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ ఏర్పడింది. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో యువతి తల్లిదండ్రులు గురువారం రాజా అన్నామలై ఇంటికి వచ్చారు. రాజా అన్నామలైని మందలించాల్సిందిగా అతని తల్లిదండ్రులకు సూచించారు. అంతేకాకుండా వారిని బెదిరించి.. ఈ వివాహం జరగదని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    నాలుగేళ్ల ప్రేమ.. యువతి వాట్సాప్ హ్యాక్ చేసిన ప్రియుడు.. ఆమె చాటింగ్ చూసి..

    ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తంగమణి, రత్నం దంపతులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనతో రాజా అన్నామలై కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Marriage, Suicide, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు