Home /News /crime /

TAMIL NADU COUPLE ARRESTED FOR DEFRAUDING UP TO RS 2 CRORE BY BUYING READYMADE GARMENTS SU

చూడటానికి అమాయకంగా కనిపిస్తున్న దంపతులు.. వీరు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సెంథిల్ మణికందన్, విజయ నిర్మల

సెంథిల్ మణికందన్, విజయ నిర్మల

కొందరి మొహాలు చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ వారు గురించిన నిజాలు వెలుగులోకి వస్తేనే.. వారు ఎంత కిలాడీలో బయటకు తెలుస్తోంది.

    కొందరి మొహాలు చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ వారు గురించిన నిజాలు వెలుగులోకి వస్తేనే.. వారు ఎంత కిలాడీలో బయటకు తెలుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. లక్షలు చెల్లించిన ఓ జంట.. ఓ వ్యాపారిని దాదాపు రూ. రెండు కోట్ల రూపాయలు బురిడీ కొట్టించింది. వివరాలు.. ప్రకాష్ అనే వ్యక్తి చెన్నైలోని రాయపురంలో ఓ ఫ్యాబ్రిక్ అండ్ గార్మెంట్స్ పేరుతో రెడీమేడ్ షాపును నడుపుతున్నారు. 2019లో పుదుచ్చేరికి సెంథిల్ మణికందన్, అతని భార్య విజయ నిర్మల.. ప్రకాష్ వద్దకు వచ్చి దుస్తుల కోసం ఆర్డర్ చేశారు. తాము పుదుచ్చేరిలో M / s Jeans Brand Factory నడుపుతున్నట్టు చెప్పారు.

    దీంతో ప్రకాశ్ .. వారి కోరినట్టుగానే రూ. కోటి 30 లక్షల విలువచేసే రెడీమేట్ దుస్తులు పంపించాడు. అయితే వాటిని స్వీకరించిన మణికందన్, విజయ నిర్మల దంపతులు ప్రకాశ్‌ను మోసం చేశాడు. కేవలం కొద్ది మొత్తం చెల్లించిన మణికందన్, విజయ నిర్మల దంపతులు.. రూ. 83 లక్షల వరకు ప్రకాశ్‌కు చెల్లించకుండా మోసం చేశారు. దీంతో ప్రకాశ్.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రిమినల్ డివిజన్‌లో ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశాడు. మణికందన్, విజయ నిర్మలపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

    ఇవి కూడా చదవండి: పెళ్లి జరిగిన కొన్ని నెలలకే భర్తకు ప్రమోషన్.. అలా జరిగినందుకు ఆనంద పడకుండా..

    Crime News: పని కోసం బయటకు వెళ్లిన భర్త.. ఇంట్లో ఉన్న భార్య ఎంత పని చేసిందంటే..

    Shocking: నైట్ డ్యూటీలో భార్య.. అందుకోసమని మరదలిని ఇంటికి తీసుకెళ్లిన బావ.. చివరకు షాకింగ్ సీన్..

    Teacher Suicide: యూనివర్సిటీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న టీచర్.. కీలకంగా వీడియో కాల్..!

    దీంతో మణికందన్ దంపతులపై కేసు నమోదు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్.. విచారణ ప్రారంభించారు. అయితే వారిద్దరు ప్రకాశ్‌తో సహా మరో 11 మందిని ఇలాగే మోసం చేశారని పోలీసులు గుర్తించారు. దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు వీరు మోసాలకు పాల్పడినట్టుగా విచారణలో తేలింది. దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వారి గురించి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు.. టిండివనంలో సెంథిల్ మణికందన్, విజయ నిర్మలను అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Cheating, Crime news, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు