తమిళనాడులోని (Tamilnadu) కళ్లకురిచి జిల్లాలో దారుణమైన ఉదంతం జరిగింది. 17 ఏళ్ల బాలుడు తన తోటి విద్యార్థిని హత్యచేశాడరు. కొంత కాలంగా సదరు బాలుడు... తనను బాడీ షేమింగ్ చేయడమే కాకుండా.. తన కుటుంబాన్ని దుర్భాలాషడంతోనే ఈ హత్య చేసినట్లు బాలుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు తన క్లాస్‌మేట్‌ను హత్య చేశాడు. అయితే తనను బాడీ షేమింగ్ (body shaming) చేయడమే కాకుండా.. తన కుటుంబాన్ని దుర్భాలాషడంతోనే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఆరోపించారు. నిందితుడు తన స్నేహితుడిని హత్య చేసినట్లు. బాధితుడు తన శరీరాకృతిపై కామెంట్ చేయడం, అసహజంగా తాకడం, కుటుంబ సభ్యులను నోటికోచ్చినట్లు మాట్లాడుతూ ఉండేవాడని నిందితుడు తెలిపాడు. ఎన్ని సార్లు చెప్పిన వినలేదని అన్నాడు.
ఈ క్రమంలోనే ఇక తీవ్ర మనస్తాపంతో హత్య చేసినట్టుగా పేర్కొన్నాడు. నిందితుడు, బాధితుడు ఇద్దరు కూడా ఓ ప్రైవేట్ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అయితే హత్యకు గురైన బాలుడు.. తరుచూ చెస్ట్ పెద్దగా ఉందని వేధించేవాడు. ఈ విషయాన్ని బాలుడు పాఠశాల యజమాన్యం దృష్టికి తీసుకెళ్లానని చెప్పాడు. కానీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే నిందితుడు, అతడిని హత్య చేయాలని భావించాడు.
దీంతో, తన ఇంట్లో పార్టీ ఉందని తన స్నేహితుడిని నిందితుడు ఆహ్వానించాడు. శనివారం సాయంత్రం సమయంలో అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేస్తున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న కొడవలితో అతడిపై దాడి చేశాడు. దీంతో అతడికి మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. అతడు నెలపై పడిపోయేవరకు కొడవలితో దాడి చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నిందితుడు అదే ఊరిలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు.
ఆదివారం ఉదయం బాధితుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ హత్యకు సంబంధించిన విచారణలో హత్యకు గురైన వ్యక్తితో నిందితుడు చివరిసారిగా కనిపించినట్టుగా తేలింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.