పురీష నాళంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మందిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 9 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎగ్జిట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమకు వచ్చిన సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి Fly Dubai Flight 8515 విమానంలో వచ్చిన మొత్తం 17 మందిని ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వారిని తనిఖీ చేయగా 9.03 కిలోల బరువు గల 48 బండిల్స్ గోల్డ్ పేస్ట్‌ను వారి పురీషనాళాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 3.93 కోట్లు విలువచేసే 7.72 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అలాగే మరిన్ని తనిఖీలు చేపట్టిన అధికారులు 386 గ్రాముల బరువు గల 12 గోల్ట్ కట్ బిట్స్‌ను, 74 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
ఇలా మొత్తంగా రూ 4.16 కోట్ల విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా కస్టమ్స్ అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అందులో ఒక మహిళ కూడా ఉందని తెలిపారు.
ఇక, నేడు పురీష నాళంలో బంగారం తరలిస్తున్న మరో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. తమిళనాడులోని రామనాథపురంకు చెందిన కలందర్ ఇలియాస్ నుంచి కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. షార్జా నుంచి ఇండిగో ఫ్లైట్ 6E 8245 విమానంలో వచ్చిన అతని అతని పురీష నాళంలో నుంచి 14 లక్షల రూపాయలు విలువచేసే 271 గ్రాముల బంగారం ముద్దలను అధికారులు సీజ్ చేశారు.
Published by:Sumanth Kanukula
First published:January 24, 2021, 18:37 IST