Home /News /crime /

TAMIL NADU 18 YEAR OLD COMMITS SUICIDE NOTE SAYS NEET WAS TOO DIFFICULT TO CRACK PAH

అమ్మా.. నన్ను క్షమించు.. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా టఫ్.. నోట్ రాసి సూసైడ్ చేసుకున్న యువకుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tamil Nadu: యువకుడు12 వ తరగతి పూర్తి చేశాడు, నీట్ ఎగ్జామ్ కోసం ప్రతి నిముషం కష్టపడి చదువుతుండే వాడు. సమయాన్ని ఏమాత్రం వెస్ట్ చేసేవాడు కాదు.

కొంత మంది పుస్తకాల పురుగుగా చదువుంటారు. తమకు కావాల్సిన ఉద్యోగం కోసం పగలనక, రాత్రనక చదువుతుంటారు. తమ జీవితాన్ని కూడా త్యాగం చేస్తుంటారు. తమ టార్గెట్ కోసం ఎంతటి త్యాగం చేయడానికైన వెనుకాడరు. కొన్ని సార్లు.. ఎగ్జామ్స్ లలో మనం ఎంత కష్టపడి చదివిన.. కాలం కూడా కలిసి రావాలి. ఒక వేళ అది మనతోని ఉండక పోతే.. మనం ఎంత కష్టపడిన అది వెస్ట్ అవుతుంది. ఈ సందర్భాలలో కొంత మంది సూసైడ్ కు పాల్పడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. కృష్ణగిరి జిల్లాలోని అరసనట్టి గ్రామంలో బుధవారం 18 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) (neet exam) కోసం కష్టపడి చదివాడు. అయితే, ఎంత కష్టపడి చదివిన అతను ఫెయిల్ అయ్యాడకు. దీంతో మానసికంగా కుంగిపోయాడు. ఎంత చదివిన ఎంట్రన్స్ లో పాస్ కాక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.



తన గదిలోకి వెళ్లి సూసైడ్ (suicide) చేసుకున్నాడు. కాగా, జి. మురళీకృష్ణగా గుర్తించిన బాలుడు 2021లో 12వ తరగతి పూర్తి చేశాడు. నీట్‌కు సిద్ధమవుతున్నాడని, గతంలో చేసిన ప్రయత్నాల్లో విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు. అతని తల్లిదండ్రులు గోపి, మోహనసుందరిని గుర్తించారు. అతను తన గదిలో శవమై కనిపించాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టారు. తీరా చూసే సరికి తమ బిడ్డ విగత జీవిగా కన్పించాడు.

అతని పక్కన ఒక సూసైడ్ నోట్ ఉంది. బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మురళి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తన శాయశక్తులా ప్రయత్నించానని, అయితే మెడికల్ కాలేజీలో చేరేంత స్కోర్ చేయలేనని ఆ నోట్‌లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. అతను తన తల్లికి క్షమాపణలు చెప్పాడు. దీంతో కుటుంబమంతా కన్నీటి పర్యంత మయ్యింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Neet exam, Suicide, Tamilnadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు