Home /News /crime /

TAMIL NADU 16 YEAR OLD GIRL WHO WAS STAYING WITH 3 MALE FRIENDS IN PARKING VEHICLE SU

స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన వాహనం.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ తిన్న సెక్యూరిటీ గార్డ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుకు ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడు షాక్ తిన్నాడు.

    ఓ స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుకు ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ 16 ఏళ్ల అమ్మాయి.. మరో ముగ్గురు అబ్బాయిలతో కలిసి ఉండటం చూసి సెక్యూరిటీ గార్డు షాక్ తిన్నాడు. ఈ ఘటనకు సంబంధిచి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని అరుంబాక్కంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలు.. అరుంబాక్కంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కోటీశ్వరన్.. పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బస్సులో నలుగురు వ్యక్తులు ఉండటం గమనించాడు. వారిలో ముగ్గురు అబ్బాయిలు తప్పించుకున్నారు. అక్కడే ఉండిపోయిన యువతిని మాత్రం కోటీశ్వరన్.. పోలీసులుకు అప్పగించారు.

    అయితే మగ వ్యక్తి వలే దుస్తులు ధరించిన ఆమెను 16 ఏళ్ల యువతిగా గుర్తించారు. అనంతరం విచారణలో.. యువతిది చెన్నైలోని జామ్‌బజార్ మీర్జాకిపేట్‌ అని తెలుసుకున్నారు. ఆమె ముగ్గురు ఫ్రెండ్స్ కార్తీక్, నిజాం, దేవలతో కలిసి బయటకు వెళ్లింది. వారు ప్రైవేట్ స్కూల్ గోడ దూకి.. అక్కడ పార్క్ చేసిన బస్సులో గంజాయి తాగారు. ఆ తర్వాత యువతి నిద్రలోకి జారుకున్నట్టుగా యువతి తెలిపింది.

    చదవండి: Warangal: వాళ్ల వేధింపులే నా చావుకు కారణం.. ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రికి ఆడియో క్లిప్

    ఈ నేపథ్యంలోనే పోలీసులు బాలిక తండ్రిని పిలిపించారు. అతడిని కూడా విచారించారు. అనంతరం బాలికను జిల్లా శిశు సంక్షేమ అధికారి.. యువతిని తన తండ్రితో కలిసి పంపించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి యువతి వేధింపులకు గురైందా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Tamil nadu

    తదుపరి వార్తలు