Home /News /crime /

Doctor Affair: ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేసిన డాక్టర్ బాబు.. పేషెంట్లను వదిలేసి పాడుపని.. వీడియోలు వైరల్..

Doctor Affair: ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేసిన డాక్టర్ బాబు.. పేషెంట్లను వదిలేసి పాడుపని.. వీడియోలు వైరల్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఇతగాడు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి అపవిత్రమైన పనులు చేస్తున్నాడు. అంతేకాదు అతగాడు చేసే పనికిమాలిన పనులను వీడియోలు తీసుకొని రాక్షసానందం పొందుతున్నాడు.

  GT Hemanth Kumar, Tirupathi, News18

  డాక్టర్ అంటే కనిపించే దేవుడు. ప్రజల ప్రాణాలు నిలబెట్టే ప్రత్యక్ష దైవం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడే దేవుడు. కానీ ఓ డాక్టర్ కామపిశాచిలా మారాడు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి అపవిత్రమైన పనులు చేస్తున్నాడు. అంతేకాదు అతగాడు చేసే పనికిమాలిన పనులను వీడియోలు తీసుకొని రాక్షసానందం పొందుతున్నాడు. ఆసుపత్రిలో పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి ఆసుపత్రికి వచ్చే మహిళల వరకు లోబరుచుకుని.., వారితో ఏకాంతంగా కలసిన సిత్రాలను రికార్డ్ చేసుకున్నాడు ఆ డాక్టర్ చివరకు కటకటాల పాలు అవ్వక తప్పలేదు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు (Tamil Naddu) తూత్తుకుడి జిల్లాలోని కోవిల్ పట్టికి సమీపంలోని ఇళయరాసానందల్ ప్రభుత్వ ప్రాధమిక వైద్య శాలలో వైద్యునిగా పనిచేస్తున్నాడు కురుసామి. మనోడికి ట్రీట్ మెంట్ ఇవ్వడమే కాదు.. అమ్మాయిలను ముగ్గులోకి దించడం కూడా తెలుసు.

  ఆస్పత్రికి వచ్చే మహిళను, అక్కడ పనిచేసే ఉద్యోగినులను కురుసామి లైంగికంగా వేధిస్తుంటాడు. అతడి దారిలో వస్తే సరే.. లేకుంటే తెలివిగా తప్పించుకుంటాడు. ఈ క్రమంలో పలువురితో వివాహేతర సంబంధం (Extramarital affair) నడుపుతున్నాడు. ఐతే  మూడు రోజుల క్రితం అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న నీలవేణి అనే మహిళ డాక్టర్ కురుసామి వేధింపులు తాళ్లలేక కోవిల్‌పట్టి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కోవిల్‌పట్టి హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ బోస్కో రాజా విచారణకు ఆదేశించారు.

  ఇది చదవండి: యూట్యూబ్ లో చూసి నాటుబాంబుల తయారీ.. యువకుడి బిజినెస్ ఐడియా.. చివరకి ఏం జరిగిందంటే..!


  కురుసామిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. దర్యాప్తులో మనోడు వెలగబెట్టిన రాసలీలల పర్వం వెలుగుచూసింది. ఆస్పత్రికి వచ్చే మహిళలు, అక్కడి సిబ్బంది ఫోన్ నెంబర్లు తీసుకోవడం వారికి అసభ్యంగా మేసేజ్ లు పెట్టడం వంటివి చేసేవాడు. ముందుగా వారు వేసుకున్న దుస్తుల గురించి కామెంట్ చేయడం.. అందాన్ని పొగుడుతూ మెసేజ్ లు పెట్టేవాడు. ఎవరైనా అభ్యంతరం తెలిపితే తప్పైపోయిందనో.. రాంగ్ మెసేజ్ అనో చెప్పి తప్పించుకునేవాడు. ఇలా చాలా మంది మహిళలక. అసభ్య మెసేజులు పంపుతూ వచ్చేవాడు.

  ఇది చదవండి: ఒంటరి మహిళను లొంగదీసుకున్న కానిస్టేబుల్.. కొన్నాళ్లకు ఆమె కూతురిపై కన్నేసి..

  ఐతే ఇటీవల ఇద్దరు మహిళలతో సంబంధం పెట్టుకున్న కురుసామి.. ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. వారితో రాసలీలలు జరుపుతూ వీడియోలు తీసుకుంటున్నాడు. ఆస్పత్రికి వచ్చిన రోగులను కూడా పట్టించుకోవడం మానేశాడు. విచారణలో భాగంగా అతడి ఫోన్ చెక్ చేసిన అధికారులకు అశ్లీల వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో అయ్యగారి బాగోతం పూర్తిగా బయటపడింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. డాక్టర్ కురుసామి బారిన పడినవారు ఎవరైనా ఉంటే తమను ఆశ్రయించాలని.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Extramarital affairs, Tamil nadu

  తదుపరి వార్తలు