తమిళ యువ నటుడు మనో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడి భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీపావళి రోజే ఈ ప్రమాదం జరిగింది. తమిళంలో యువ నటుడుగా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన మనో తన భార్యతో కలసి దీపావళి రోజు చెన్నైకి వెళ్తుండగా సెంటర్ మీడియమ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మనో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మనో అక్కడిక్కడే చనిపోయాడు. అతడి భార్యను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మనో దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. ఓ వైపు తండ్రి చనిపోయి, మరోవైపు తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉండగా, ఆ కుమార్తెను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మనో మరణంపై తమిళ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ‘పుగళ్’ అనే తమిళ సినిమాలో మనో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మనో ఎక్కువ పేరు సంపాదించాడు. సన్ టీవీలో వచ్చే ఓ డ్యాన్స్ షోకు యాంకర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఆ తండ్రి రియల్ బాహుబలి.. కొడుకును కాపాడాడిలా..
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.