ఈ చెల్లి తన అన్న మాట విని వాట్సాప్, ఫేస్ బుక్ వాడకుండా ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు..

Photo Credit : News 18 Tamil Nadu

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్​ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. దీని వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయ్.

 • Share this:
  ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్​ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. దీని వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయ్. ఇలాంటి దారుణమే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో చోటు చేసుకుంది. వాట్సాప్‌ వీడియోలు చూస్తోందని మలైరాజా అనే వ్యక్తి తన చెల్లిని కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. సుధలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురం చెందినవాడు. ఈ రైతుకు ఒక కుమారుడు మలైరాజా (20), కుమార్తె కవిత (17) ఉన్నారు. కవిత ప్లస్ టూ చదువుతోంది. తన చెల్లి కవితకు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్‌పోన్‌లో వీడియోలు చూస్తోంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మలైరాజా చెల్లిని పలు మార్లు హెచ్చరించాడు. అలా చేస్తే నీకు ముప్పు అని చెల్లెలికి చెప్పాడు. అన్న..మాటను ఆమె లెక్క చేయలేదు.

  ప్రతి రోజు దీనిపై వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయ్. అయితే ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని.. కవితను అన్న మలైరాజా వెనుక నుంచి కత్తితో పొడిచి చంపాడు. దీంతో తీవ్రగాయాపాలైన కవిత మృతి చెందింది. చెల్లిని చంపిన తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  వల్లానాడు సమీపంలోని అడవిలో పారిపోతున్న రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో వాసవంపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికుల్లో కలకలం రేగింది. సొంత అన్నే చెల్లెలిని చంపడంతో ఆ రైతు కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయ్.
  Published by:Sridhar Reddy
  First published: