Girls and Widows: వారికి 15 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలు.. 45 ఏళ్ల లోపు వితంతువులు కావాలట.. ఎందుకో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Girls and Widows: ఆప్ఘనిస్థాన్​లో తాలిబన్ల ఆధిపత్యం మరోసారి పెరిగిపోతోంది. ఆప్ఘన్​ సైనిక దళాలు, తాలిబన్ల యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఆప్ఘనిస్థాన్​లోని చాలా భాగం తాలిబన్ల వశమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని మత నాయకులకు తాలిబన్లు ఓ డిమాండ్ చేశారట. విషయం ఏటంటే..

  • Share this:
ఆప్ఘనిస్థాన్​లో తాలిబన్ల ఆధిపత్యం మరోసారి పెరిగిపోతోంది. ఆప్ఘన్​ సైనిక దళాలు, తాలిబన్ల యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఆప్ఘనిస్థాన్​లోని చాలా భాగం తాలిబన్ల వశమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని మత నాయకులకు తాలిబన్లు ఓ డిమాండ్ చేశారట. తమ ప్రాంతంలోని 15 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు, 45 ఏళ్ల వయసులోపల ఉన్న వితంతువుల వివరాలు ఇవ్వాలని అడిగారని సమాచారం. వారి లిస్ట్ ఇస్తే తమ గ్రూప్​ల్లోని వారితో పెళ్లి చేసి పాకిస్థాన్​కు పంపుతామని ఆఫ్ఘన్ మత నేతలను కోరారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు తాలిబన్లు లేఖ విడుదల చేశారని ఆఫ్ఘన్​కు చెందిన మీడియా పేర్కొంది. “తాలిబన్ యోధులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మీ ప్రాంతంలోని 15 ఏళ్ల వయసు దాటిన అమ్మాయిలు, 45 సంవత్సరాల లోపు వితంతువులను ఇమామ్​లు, ముల్లాలు గుర్తించాలి. వారి లిస్ట్ ఇవ్వాలి” అంటూ తాలిబన్​ కల్చరల్ కమిషన్​ లేఖ విడుదల చేసిందని సన్​ పేర్కొంది.

తజకిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​, పాకిస్థాన్​, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్​లోని జిల్లాలను తాలిబన్లు దాదాపు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సూచనలు చేశారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత అమెరికా, నాటో తమ భద్రతా దళాలను ఆఫ్ఘనిస్థాన్​ నుంచి ఉపసహరించుకున్నప్పటి నుంచి మళ్లీ తాలిబన్ల ఆధిపత్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది. మరోవైపు సరైన వనరులు లేక ఆప్ఘన్ భద్రతా దళాలు.. తాలిబన్లను తిప్పికొట్టలేకున్నాయి. మహిళలు బయటికి రాకూడదని, పురుషులందరూ గడ్డాలు పెంచాలని తాలిబన్లు ఇటీవల తఖర్ జిల్లాలో ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. బాలికలకు కట్నం నిబంధనలను జారీ చేయడంతో పాటు అందరూ ఇస్లామిక్ చట్టాలను పాటించాలని హుకూం జారీ చేశారు.

2001కు ముందు ఆప్ఘనిస్థాన్​లో తాలిబన్ల పాలన నడిచింది. అప్పట్లో బాలికలు, మహిళలు చదువుకోకూడదని, ఉద్యోగాలు చేయకూడదని, పురుషుడు వెంట లేనిదే బయటకు రాకూడదని తాలిబన్లు నిబంధనలు పెట్టారు. వాటిని ఉల్లంఘించిన వారికి అవమానకర రీతిలో బహిరంగంగా శిక్షలు వేశారు. అయితే 2001లో అమెరికా జోక్యం తర్వాత తాలిబన్ల ఆధిక్యం తగ్గింది. ప్రభుత్వాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అమెరికా తమ బలగాలను వెనక్కి పిలవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్లు తమ ఆడపిల్లలను తీసుకెళ్లి.. బలవంతంగా పెళ్లి చేసుకొని బానిసలు మారుస్తామని చెబుతున్నారని ఆఫ్ఘనిస్థాన్​లోని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “తాలిబన్లు మా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాక చాలా బాధలు పడుతున్నాం. కుంగిపోతున్నాం. ఇంట్లో కూడా గట్టిగా మాట్లాడుకోలేం. సంగీతం వినలేకున్నాం. మార్కెట్​కు మహిళలను పంపలేకున్నాం” అని ఆప్ఘని​స్థాన్​కు చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.
Published by:Veera Babu
First published: