Talibans: తాలిబాన్ల ఆటవిక చర్య.. 12 ఏళ్ల బాలికలనూ వదిలిపెట్టని వైనం..

ప్రతీకాత్మక చిత్రం

యుద్ధం అనంతరం తమ సైనికులు పెళ్లిల్లు చేసుకోవడానికి 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు గల మహిళలను సిద్దంగా ఉంచండని గత నెలలోనే తాలిబాన్లు అక్కడి పెద్దలు, ఇమామ్​లకు ఆదేశాలు జారీచేశారు. అయితే ఇపుడు ఏకంగా 12 ఏళ్ల పైబడిన బాలికలను కూడా దీనిలోకి లాగుతున్నట్లు అక్కడి కాలమిస్టులు చెబుతున్నారు.

 • Share this:
  ఆప్ఘన్​(Afghan)లో తాలిబాన్ల ఆటవిక(barbaric) రాజ్యం మొదలైంది. ఇప్పటికే అక్కడ తమకు వ్యతిరేకులను మట్టుబెట్టిన తాలిబాన్లు(Taliban’s) ఇపుడు ఏకంగా చిన్నారులు, మహిళల(women)పై పడ్డారు. యుద్ధం(war)లో గెలిచినందుకు అక్కడి మహిళలు, చిన్నారుల(minor girls)ను బానిసలుగా చేసుకుంటున్నారు. తమ సైనికులకు బాలికల(girls)ను ఇచ్చి పెళ్లిల్లు(marriage) చేయాలని కుటుంబీకులను ఆదేశిస్తున్నట్లు తెలిసింది. తాలిబాన్ల ఆటవిక చర్యలు ఎలా మారాయంటే ఏకంగా 12 ఏళ్లు(years) పైబడిన పెళ్లికాని బాలికలను సైతం వదిలిపెట్టట్లేదట. వారిని లైంగిక బానిసలుగా చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్కడ గోడలపై ఉన్న మహిళల చిత్రాలపై కూడా తెల్లరంగు పూసి కనిపించకుండా చేస్తున్నారంటే అక్కడ భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. అయితే తాలిబాన్ల వైఖరిపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా మొదలయ్యాయి. మహిళలు బహిరంగంగానే తమ భయాలు సోషల్​మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తమను చంపేయడం ఖాయం అంటూ బోరుమంటున్నారు.

  తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) వెళ్లిపోయింది. వారి గురించి, వారి వ్యవహారశైలి గురించి ఇప్పటికే ప్రపంచానికి కొద్దోగొప్పో తెలుసు. ప్రాణభయంతో తమ భార్యాబిడ్డలను వదిలేసి ప్రాణాలను దక్కించుకునేందుకు మగవారు విమానాలు వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితిని తెలుపుతోంది. ప్రాణభయంతో ఎలాగైనా ఆఫ్ఘన్ దేశాన్ని(country) వీడి వచ్చేయాలని విమానాల పైకి ఎక్కేస్తున్నారు. కొంతమంది విమాన చక్రాలను పట్టుకుని వేలాడుతూ గగనతలంలో పట్టుతప్పి కిందపడి చనిపోయారు. ఈ దారుణ దృశ్యాలు ఇపుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కనబడుతున్నాయి. తాలిబన్ల చెరలో మహిళ పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పుడుతోంది. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాలిబాన్ల  చర్యలను నిరసిస్తూ పలు ట్వీట్లు సైతం పెడుతోంది. తాలిబన్లు అక్కడి మహిళలను సెక్స్ బానిసలుగా మార్చేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.అక్కడ గోడలపై ఉన్న మహిళల చిత్రాలపై కూడా తెల్లరంగు పూసి కనిపించకుండా చేస్తున్న చిత్రాన్ని ట్విటర్​లో షేర్​ చేసి విమర్శలు గుప్పించింది. అంతర్జాతీయ సమాజం తాలిబన్లను అలా వదిలేస్తే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళల పరిస్థితి ఎలా వుంటుందో కూడా చెప్పలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా, యుద్ధం అనంతరం తమ సైనికులు పెళ్లిల్లు చేసుకోవడానికి 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు గల మహిళలను సిద్దంగా ఉంచండని గత నెలలోనే తాలిబాన్లు అక్కడి పెద్దలు, ఇమామ్​లకు ఆదేశాలు జారీచేశారు. అయితే ఇపుడు ఏకంగా 12 ఏళ్ల పైబడిన బాలికలను కూడా దీనిలోకి లాగుతున్నట్లు అక్కడి కాలమిస్టులు చెబుతున్నారు. ఓ మీడియా సంస్థకు కాలమిస్టు రూత్​ పొలార్డ్​ ఈ విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకు 15 ఏళ్ల వరకే ఉన్న తంతు ఇపుడు 12 ఏళ్ల బాలికలకూ విస్తరించిందని అన్నారు. తాలిబాన్లు ఇంటింటికీ తిరుగుతున్నట్లు 12 నుంచి 45 ఏళ్ల వయస్సు గల మహిళలు, బాలికలను బలవంతంగా వివాహం చేసుకుంటున్నట్లు ఆమె తన వ్యాసంలో రాశారు. అక్కడి మహిళలను వస్తువులుగా భావించి ఇదంతా చేస్తున్నారని ఓ ఓ వర్సిటీ ప్రొఫెసర్​ ఒమర్​ సదర్​ అభిప్రాయపడ్డారు.
  Published by:Prabhakar Vaddi
  First published: