హోమ్ /వార్తలు /క్రైమ్ /

53 ఏళ్ల విదేశీ మహిళతో ఎఫైర్.. ఆరునెలలకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..

53 ఏళ్ల విదేశీ మహిళతో ఎఫైర్.. ఆరునెలలకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: విదేశీ మహిళను పరిచయం చేసుకున్నాడు. తియ్యగా మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని తన వలలో వేసుకున్నాడు. రోజు ఇద్దరు మాట్లాడుకునే వారు. అది కాస్త ప్రేమగా మారింది.

కొందరు ప్రేమ పేరుతో అవతలి వారిని మోసం చేస్తున్నారు. తమ అవసరాలకు ప్రేమను పావుగా ఉపయోగించుకుంటున్నారు. ఎదుటి వారిని ప్రేమిస్తున్నామంటూ, ముగ్గులోనికి దింపుతున్నారు. ఆ తర్వాత.. వారి బలహీనతలను ఆసరా చేసుకుని వేధిస్తున్నారు. తమ అవసరాలు తీరే వరకు ప్రేమిస్తున్నట్లు (love affair) నటిస్తున్నారు. ఆతర్వాత.. ముఖం చాటేస్తున్నారు. మరికొందరు ఫ్రెండ్ షిప్ ముసుగులో అడ్డమైన పనులన్ని చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. అంతే కాకుండా.. వారిని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తున్నారు. ఎదుటి వారి ఫీలింగ్స్ తో ఆడుకుంటుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana) గుర్గావ్ లో దారుణ ఘటన జరిగింది. తైవాన్ కు చెందిన 53 ఏళ్ల మహిళ, గుర్గావ్ లో ఉంటుంది. ఆమె 2017 నుంచి గుర్గావ్ ఎన్జీవోలో పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఆమెకు మధ్య ప్రదేశ్ కు చెందిన రవీంద్ర విశ్వకర్మతో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారి, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రవీంద్ర స్థానికంగా ఉన్న ప్రైవేటు క్లినిక్ లో పనిచేసేవాడు. ఇతనికి తైవాన్ మహిళ ఫిబ్రవరిలో పరిచయం అయ్యింది.

అప్పటి నుంచి ఆమెతోనే ఒకే ఇంట్లో ఉండేవాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో అతను కొద్ది రోజులుగా దూరం పెడుతున్నాడు.దీంతో మహిళ తనను పెళ్లి చేసుకొవాలని బలవంతం చేసింది. అతను నిరాకరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh)  షామ్లీ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది.

ఖేదా కుర్తాన్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఉమర్దీన్ అనే 33 ఏళ్ల వ్యక్తి, మరికొందరితో కలిసి కూలీపనులకు వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం అందరు కలిసి భోజనం చేస్తున్నాడు. అప్పుడు.. ఉమర్దీన్ మేనకోడలు.. తనకు మామిడి పండు కావాలని కోరింది. చిన్నారి లేదనిచెప్పిన వినలేదు. తనకు మామాడి పండు కావాలని మారం చేసింది.

మెడ, శరీర భాగాల్లో రాడ్ ను చొప్పించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావమైంది. ఈ క్రమంలో బాలిక అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను గోనె సంచిలో వేశాడు. సమీపంలోని అడవి ప్రాంతంలో వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. కాగా, కూలికి వెళ్లిన మరో వ్యక్తి తన కూతురు కన్పించక పోవడంతో అక్కడ చుట్టుపక్కల వెతికాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Haryana

ఉత్తమ కథలు