Home /News /crime /

తహసీల్దార్ సజీవ దహనం కేసు... ప్రమాదాన్ని ముందే ఊహించిన విజయారెడ్డి ?

తహసీల్దార్ సజీవ దహనం కేసు... ప్రమాదాన్ని ముందే ఊహించిన విజయారెడ్డి ?

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

గతేడాది విజయారెడ్డి ఉత్తమ ఎమ్మార్వోగా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకుందని ఆమె మేనమామ వెంకట్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

    రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణ హత్యకు గురైన తహశీల్దార్ విజయారెడ్డి కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను లంచం అడిగినందుకే విజయారెడ్డిని సజీవ దహనం చేసినట్టు నిందితుడు, రైతు సురేష్ పోలీసులకు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు నిందితుడిని మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే చనిపోయిన విజయారెడ్డి... తనకు ప్రమాదం ఉందనే విషయాన్ని ముందుగానే ఊహించారనే విషయం ఆమె బంధువుల మాటలను బట్టి అర్థమవుతోంది. విజయారెడ్డి హత్యపై స్పందించిన ఆమె మేనమామ వెంకట్ రెడ్డి... కొద్దిరోజుల క్రితమే కలెక్టర్ ఆఫీసులో సెక్యూరిటీ కోసం ఫిర్యాదు చేసిన విజయారెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

    గతేడాది విజయారెడ్డి ఉత్తమ ఎమ్మార్వోగా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకుందని విజయారెడ్డి మేనమామ వెంకట్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మూడేళ్ల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయారెడ్డి పని చేస్తున్నారని... ఏ విషయంలో అయినా ఆమె ముక్కుసూటిగా వ్యవహరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయారెడ్డి ఇద్దరు సంతానం. పాపకు పదేళ్లు, బాబుకు ఐదేళ్లు. మొదట ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసిన విజయారెడ్డి... ఆ తరువాత గ్రూప్ 2లో ఉత్తర్ణీత సాధించారు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి హయత్ నగర్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు.




    First published:

    Tags: Crime news, Hyderabad, MRO, Tahasildar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు