తహసీల్దార్ నిర్వాకం.. బతికున్న రైతును చనిపోయాడంటూ పొలం పట్టా మార్పిడి..

తనకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న రైతు కుటుంబం

రైతు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి రైతు పేరు మీద ఉన్న భూమిని వేరే వారికి పట్టా మార్పిడి చేసిన వైనం వెలుగు చూసింది.

  • Share this:
    సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తహసీల్దార్ జయరాం నాయక్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రైతు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి రైతు పేరు మీద ఉన్న భూమిని వేరే వారికి పట్టా మార్పిడి చేసిన వైనం వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన కొట్టంలా పెంటయ్య అనే రైతు పేరు మీద 1 ఎకరా 17 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిని హత్నూర మండలం తహసీల్దార్ జయరాం నాయక్ కొట్టంలా పెంటయ్య ను చనిపోయినట్లు రికార్డులు సృష్టించి వేరే వారి పేరు మీద పౌతి మార్పిడి చేశాడు అని ఆరోపించారు.

    ఈ విషయంలో రైతుకు సంబంధిచిన కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ జయరాం నాయక్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: