విజయారెడ్డి హత్యకేసు... నిందితుడు సురేష్ పరిస్థితి విషమం... డాక్టర్ల డెడ్‌లైన్

విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్(ఫైల్ ఫోటో)

65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్‌కు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది.

  • Share this:
    తహశీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసుకున్న సురేష్... ఈ క్రమంలో తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్‌కు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసుల సంరక్షణలో నిందితుడు సురేష్‌కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. 24 గంటలు దాటితే... స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

    అంతకుముందు నిందితుడు సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని అన్నాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. లీటర్ పెట్రోల్ కొనుక్కుని బ్యాగ్‌లో ముందే పెట్టుకున్నానని అన్నాడు. మరోసారి భూపట్టా కోసం విజయారెడ్డిని వేడుకున్నానని... పట్టాలేదని చెప్పడంతో పెట్రోల్ పోసి తగులపెట్టానని వివరణ ఇచ్చాడు.


    First published: