తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేష్ పరిస్థితి అత్యంత విషమం..

విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్(ఫైల్ ఫోటో)

తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్... ఈ క్రమంలో తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

  • Share this:
    తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్... ఈ క్రమంలో తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్‌కు ఉస్మానియాలో చికిత్స అందించారు. న్యూరోబర్న్ షాక్‌లో ఉన్న సురేష్ పరిస్థితి బుధవారం మరింత విషమించింది. దీంతో సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని అన్నాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. లీటర్ పెట్రోల్ కొనుక్కుని బ్యాగ్‌లో ముందే పెట్టుకున్నానని అన్నాడు. మరోసారి భూపట్టా కోసం విజయారెడ్డిని వేడుకున్నానని... పట్టాలేదని చెప్పడంతో పెట్రోల్ పోసి తగులపెట్టానని వివరణ ఇచ్చాడు. అయితే సురేష్ నుంచి మరోసారి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఇక విజయారెడ్డి హత్య సందర్భంగా తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.

    Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Card Lost: క్రెడిట్, డెబిట్ కార్డులు పోయాయా? వెంటనే ఇలా చేయండి

    Jan Dhan Account: మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా? లాభాలివే

    ATM: ఛార్జీలు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా... ఎన్నిసార్లైనా చేయొచ్చు ఇలా
    First published: