ముగిసిన ఏసీబీ కస్టడీ...చంచల్‌గూడ జైలుకు తహసీల్దార్ లావణ్య

Tahasildar Lavanya | తహసీల్దారు లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగియంతో ఆమెను వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

news18-telugu
Updated: July 20, 2019, 9:59 PM IST
ముగిసిన ఏసీబీ కస్టడీ...చంచల్‌గూడ జైలుకు తహసీల్దార్ లావణ్య
తహశీల్దార్ లావణ్య
news18-telugu
Updated: July 20, 2019, 9:59 PM IST
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. ఏసీబీ కస్టడీ ముగియంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో లావణ్య ఇంట్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి.  ఆమె బంధువుల ఖాతాల్లోనూ భారీగా నగదు గుర్తించారు. ఆమె ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో ఉత్తమ తహశీల్దారుగా ప్రభుత్వ అవార్డు పొందిన లావణ్య...పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అమెను  అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో లావణ్య, కొందుర్గు వీఆర్వో అనంతయ్య‌ను రెండు రోజుల పాటు(శుక్రవారం, శనివారం) తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.

లావణ్య ఇంట్లో పట్టుబడిన నగదు


ఇంట్లో దొరికిన రూ.93 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది? తహసీల్దార్‌ కార్యాలయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు? ఎవరెవరి దగ్గర లంచాలు స్వీకరించారు? తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు. రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారం ముగియంతో...వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  అనంతరం లావణ్య, అనంతయ్యను చంచల్‌గూడ జైలుకు తరలించారు.తహసీల్దారు లావణ్య ఇంట్లో పట్టుబడిన బంగారు ఆభరణాలు
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...