హోమ్ /వార్తలు /క్రైమ్ /

అవినీతి కేసులో తహశీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్..

అవినీతి కేసులో తహశీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్..

తహశీల్దార్ లావణ్య(File Photo)

తహశీల్దార్ లావణ్య(File Photo)

ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు.ఇద్దరిని విచారించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఇద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు సమాచారం.

    అవినీతి కేసులో దొరికిపోయిన తహశీల్దార్ లావణ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు రిమాడ్‌ విధించింది.హయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాల అనంతరం ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు.ఇద్దరిని విచారించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఇద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు సమాచారం.


    కాగా,రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న ఆమె.. ఇప్పుడు అవినీతి కేసులో బుక్ కావడం గమనార్హం.రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లికి చెందిన మామిడిపల్లి భాస్కర్ అనే రైతు తన 9 ఎకరాల పొలాన్ని ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకోగా.. అది ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు.దీంతో కొందుర్గు వీఆర్వో అనంతయ్యను సంప్రదించగా.. ఎకరానికి రూ.1లక్ష చొప్పున లంచం అడిగాడు.చివరకు రూ.8లక్షలకు డీల్ కుదరడంతో.. ఇందులో తన వాటా రూ.3లక్షలు, తహశీల్దార్ లావణ్య వాటా రూ.5లక్షలు అని చెప్పాడు.అయితే భాస్కర్ ఏసీబీ అధికారులను సంప్రదించి.. అనంతయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు.


    అనంతరం అనంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ హయత్‌నగర్‌లోని తహశీల్దార్ లావణ్య ఇంట్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో రూ.93లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు గుర్తించారు.అయితే వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. అక్రమాస్తులు కూడబెట్టిందన్న ఆరోపణలతో అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.

    First published:

    Tags: Corruption, Tahasildar, Telangana, Telangana revenue

    ఉత్తమ కథలు