సిరియాలో కారుబాంబు పేలుడు .. 14మంది మృతి

ఈ ఘటనలో 14 మంది మరణించగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

news18-telugu
Updated: June 3, 2019, 7:15 AM IST
సిరియాలో కారుబాంబు పేలుడు .. 14మంది మృతి
సిరియాలో కారు బాంబు దాడి
  • Share this:
పేలుళ్లతో మరోసారి సిరియా చిగురుటాకులా వణికింది. సిరియాలో కారు బాంబు పేలుడు ఘటనలో 14 మంది మరణించిన ఘటన సంచలనం రేపింది. సిరియా దేశంలోని అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలోని ఈ దాడి జరిగింది. జనం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కారును డిటనేటర్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో 14 మంది మరణించగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

రఖ్కా నగరంలోని కమాండ్ సెంటరు వద్ద కుర్ధిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ కారు బాంబు పేల్చివేతలో పదిమంది మరణించారు. ఈ ఘటన జరిగిన మరునాడే అజాజ్ నగరంలో గుర్తుతెలియని వ్యక్తులు కారును డిటోనేటర్లతో పేల్చివేశారు. ఈ కారును పేల్చింది ఎవరో ఇంకా తేలలేదు. రెండు రోజుల క్రితం అగ్రరాజ్యంలో అమెరికాలో కూడా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుండగుడి విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారు.

 

First published: June 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading