జగిత్యాల జిల్లాలో ప్రమాదం.. బావిలో పడిన స్విఫ్ట్ కారు..

సారంగాపూర్ మండల కేంద్రం సమీపంలో గల వ్యవసాయ బావిలో స్విఫ్ట్ డిజైర్ కారు పడిపోయింది.

news18-telugu
Updated: July 19, 2019, 8:30 PM IST
జగిత్యాల జిల్లాలో ప్రమాదం.. బావిలో పడిన స్విఫ్ట్ కారు..
బావిలో పడిన కారులోనుంచి బాధితులను బయటకు తీస్తున్న గ్రామస్తులు
  • Share this:
జగిత్యాల జిల్లాలో ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. సారంగాపూర్ మండల కేంద్రం సమీపంలో గల వ్యవసాయ బావిలో స్విఫ్ట్ డిజైర్ కారు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారులో ఉన్న నలుగురు సిరిసిల్లకు చెందిన డాక్టర్ లు సంతోష్ , రాజేందర్ , శ్యామ్ , విజయ్ గా గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో కారును పోలీసులు బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి తరలించారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>